బీపాజిటివ్ తరపున మీకు శుభాకాంక్షలు. మీ జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ప్రదేశం వివరాలు, ఖచ్చితమైన సమయం మాకు పంపండి. మరుసటి రోజే మీ జాతక ఫలితాలను బీపాజిటివ్ వెబ్ సైటులో చూసుకోవచ్చు. ఒక వ్యక్తి రోజుకు ఒక ప్రశ్న మాత్రమే పంపాలి. ప్రశ్న వీలున్నంత క్లుప్తంగా ఉండాలి. రోజూ నలుగురి ప్రశ్నలకు జవాబులివ్వటం జరుగుతుంది.

ఏకాగ్రతను పెంచే వృక్షాసనం

ఈ ఆసన స్థితి చెట్టును పోలి ఉంటుంది గనుక దీనికి వృక్షాసనం అని పేరు. రోజూ వృక్షాసన సాధన చేసేవారి ఏకాగ్రత పెరుగుతుంది. 

MORE
Recent Storiesస్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE
 • Q.మాపాత ఇంటి టేకు తలుపులు, కిటికీలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిని ఇప్పుడు కట్టబోయే ఇంటికి వాడొచ్చా?
 • అలా చేయక పోవటమే మంచిది. మీకున్నంతలో కొత్తవి కొనుక్కునేందుకు ప్రయత్నించండి.


 • Q.ఇల్లు కట్టుకొని పైన కూడా ఒక అంతస్తు వేద్దామని మొదలుపెట్టాం. ఆర్ధిక కారణాల వల్లపిల్లర్లు మాత్రమేవేసి కప్పు వేయకుండా వదిలేశాం . ఇది వాస్తు సమస్యలకు దారితీస్తుందా?
 • చాలామంది డబ్బు, సమయం, శ్రమ కలిసి వస్తాయని ఇలా వేస్తున్నారుగానీ అది వాస్తు విరుద్ధమైన పని.ఇదిస్తంభ దోషానికి దారితీస్తుంది . దీని వల్ల ఇంటిల్లిపాదీ ఎప్పుడూ ఎదో ఒక అనారోగ్యంతో బాధపడతారు. ఏ పనీ అనుకున్నట్లు పూర్తికాక పోవటమే గాక తరచూ వాయిదా పడుతుంటుంది.


 • Q.చోటు తక్కువగా ఉన్నందున మా ఇంటి నైరుతి మూలన మెట్లు కట్టి దానికింద టాయిలెట్స్ కడదామని అనుకుంటున్నాం. ఆలా చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా?
 • నైరుతి మూల మెట్ల కింద టాయిలెట్స్ కడితే ఆర్థిక సమస్యలే గాక అనారోగ్య సమస్యలో చుట్టుముడతాయి. మీ వాస్తు సిద్ధాంతిని సంప్రదించి తగిన చోట టాయిలెట్స్ కట్టుకోండి.


 • Q.మా ఇంటికి దక్షిణంలో పెద్ద గుంత ఉంది. ఇలా ఉంటే వాస్తుపరంగా ఏదైనా ఇబ్బందా?
 • ఇంటికి దక్షిణంలో గుంత ఉండటం, లేదా అక్కడ ఉన్న ఇల్లు మన ఇంటికంటే దిగువన ఉండటం ఖచ్చితంగా వాస్తు లోపమే.ఇలా వున్నప్పుడు ఎత్తుగా ఉన్న ఇంట్లో కాపురముండే వారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం పాలవుతారు.దీనికి వాస్తులో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. నిపుణులైన వాస్తు సిద్ధాంతిని సంప్రదించి వెంటనే ఆయా సమస్యల నుంచి బయటపడండి.


 • Q.పెద్దల నుంచి సంక్రమించిన చోటులో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం గానీ మా చోటుకు తూర్పువైపు కొండ ఉండటంతో సందేహిస్తున్నాం. అక్కడ ఇల్లు కట్టుకోవటం వల్ల వాస్తు సమస్యలు వస్తాయా?
 • ఇంటి చోటుకుతూర్పు, ఈశాన్యం, ఉత్తరం దిక్కులలో కొండలు, గుట్టలు ఉంటే అక్కడ ఇంటి నిర్మాణం చేయటానికి వాస్తు అంగీకరించదు. అదే దక్షిణం, పడమర, నైరుతి, వాయువ్యాన అయితే పర్వాలేదు.


 • Q.మా పాప ఇంటర్ రాసింది. ఎంసెట్ పరీక్షకు సిద్దం అవుతోంది. ఈ మధ్య చదువు వదిలి పెట్టి ఎప్పుడూ మొబైల్, కంప్యూటర్ మీద గేమ్స్ ఆడుతుంది. అదేమని మందలిస్తే నాకు రాంక్ తప్పక వస్తుందని ధీమాగా చెబుతుంది. ఇంకా ఒత్తిడి చేస్తే నీకెందుకు? నీకేం తెలియదు అంటూ వాదనకు దిగుతోంది . మా పాప బుద్ధిగా చదువుకోవాలంటే ఏం చేయాలి?
 •  ఏకాగ్రతా లోపం వల్ల ఈ సమస్య వచ్చినట్లు అనిపిస్తోంది. ఇలాంటి వారు ఎక్కువ సమయం  ఒకే పని చేయలేరు. తీవ్రమైన భయం, ఆందోళన ఉన్న వారూ ఇలా ప్రవర్తించే అవకాశం ఉంది. పాపను ఒకసారి  సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి  కౌన్సిలింగ్ ఇప్పిస్తే మేలనిపిస్తోంది. 


 • Q. నా వయసు 22 ఏళ్ళు . ఇంజనీరింగ్ విద్యార్ధిని. నాకు ముఖం, మెడ, చంకల్లో పులిపిర్లు వచ్చాయి. మందులు వాడినా తగ్గకపోగా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి . కాస్త ఎండ తగిలితే ఆ భాగంలో మంట పుడుతోంది. నా సమస్యకు పరిష్కారం లేదా?
 • శరీరంలో జరిగే హార్మోనుల మార్పు, కాలుష్యం, చెమట, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల పులిపిర్లు రావచ్చు. వైరస్ వాళ్ళ వచ్చే ఈ సమస్యకు వీలున్నంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఏ మాత్రం మచ్చలు పడకుండా, నొప్పి లేకుండా  పులిపిర్లు తీసే పలు విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి గనుక మీరు కంగారు పడాల్సిన పనిలేదు. వు. కంటికి కనిపించనంత బుల్లి పులిపిర్లను కూడా తీసే పరిజ్ఞానం ఇప్పుడు ఉంది. మీ చర్మ స్వభావం, పులిపిర్ల సంఖ్య తదితర అంశాలను బట్టి ఒకటే సిట్టింగ్ లేదా రెండా అనేది ఆదారపడి ఉంటుంది. 


 • Q.నా వయసు 32 ఏళ్ళు. ప్రభుత్వ ఉద్యోగిని. రోజంతా దాదాపు కూర్చొనే పని చేయతం వల్ల పొట్ట బాగా పెరిగింది. దీన్ని తగ్గించుకోవటానికి డైటింగ్ట్, జిమ్, యోగా వంటివి చేసాను గానీ ఏలాంటి ఫలితం లేదు. నేను బేరియాట్రిక్ సర్జరీ చేయించుకొని పొట్ట తగ్గించుకోవచ్చా?
 • మీరు వ్యాయామాలు, యోగా చేసినట్లు చెప్పారు. వాటిని  చేయటం ఎంత ముఖ్యమో వాటిని తగిన రీతిలో, దీర్ఘకాలం చేయటమూ అంతే ముఖ్యం. మీ వయసు చిన్నదే గనుక రిస్క్ ఉండే సర్జరీల  జోలికి పోవద్దు. మరీ కావాలనుకుంటే క్రయో లైపోలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు. దీనివల్ల మీ సమస్య తీరుతుంది గానీ తగిన జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం మళ్ళీ సమస్య మొదటికి రావచ్చు. అందుకే ఒకసారి వైద్యుల సహా తీసుకోవటం మంచిది. 


 • Q.నాకు యాభై ఏళ్ళు . ఆ మధ్య తుంటి, నడుము వద్ద చిన్న చిన్న గుల్లలు వచ్చి వాటంతట అవే మాడిపోయాయి. అయితే రెండు రోజుల నుంచి అక్కడే నాకు విపరీతమైన నొప్పి వస్తోంది. నా సమస్యకు కారణం ఏమై ఉంటుంది?
 • చెప్పిన లక్షణాలను బట్టి మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో ఉన్నట్లు అనిపిస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న మధుమేహుల్లో  ఇది రావచ్చు. జబ్బు వచ్చినపుడు మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది మీరు భయపడాల్సినంత పెద్ద సమస్య కాదు . ఒకసారి మీ  డాక్టర్‌ను సంప్రందించి వారి సలహా పాటించండి. 


 • Q.వయసు 29 ఏళ్ళు. పదేళ్ళ క్రితం మూర్చ వచ్చినా మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్య కనిపించలేదు. నేను ఇటీవలే గర్భం దాల్చాను. నేను వాడే మూర్చ మందుల ప్రభావం బిడ్డమీద పడుతుందా?
 • ఒకసారి మూర్ఛ వచ్చిన వారు ఆ తర్వాత కూడా మందులు వాడాల్సిందే. అయితే ఈ మందుల వల్ల బిడ్డ కొన్ని లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నందున గర్భధారణకు ముందునుంచే ఫోలేట్ అనే మందు తీసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు ఆ మందు వాడినా ప్రయోజం లేదు. మీ వైద్యుడిచ్చే సలహాలు పాటిస్తూ రెగ్యులర్‌గా స్కానింగ్ చేయించుకుంటే ఎడైలా లోపాలున్నా ముందుగా తెలిసిపోతుంది. డెలివరీ తర్వాత మరోసారి గర్భం దాల్చడానికి ముందు నుంచే ఫోలేట్ విటమిన్‌ను తీసుకోండి. • Q.when i will marry
 • బిపాజిటివ్ వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు. 

  దయచేసి మీ సరైన జన్మదిన వివరాలను పంపగలరు. 


 • Q.I want to Know my Astrology
 • బిపాజిటివ్ వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు. 

  తూర్పు గోదావరి జిల్లాలో మీరు ఎక్కడ జన్మించారో వివరంగా తెలుపగలరు. 


 • Q.can i know breifly my jatakam
 • బిపాజిటివ్ వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు. 

  దయచేసి మీ సరైన జన్మదిన వివరాలను పంపగలరు. 


 • Q.please send breif jathakam
 • బిపాజిటివ్ వెబ్ సైట్ ను సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మీ జాతక ఫలితాన్ని అందించగలము.