• HOME
  • ఆరోగ్యం
  • Q.వయసు 29 ఏళ్ళు. పదేళ్ళ క్రితం మూర్చ వచ్చినా మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్య కనిపించలేదు. నేను ఇటీవలే గర్భం దాల్చాను. నేను వాడే మూర్చ మందుల ప్రభావం బిడ్డమీద పడుతుందా?
  • ఒకసారి మూర్ఛ వచ్చిన వారు ఆ తర్వాత కూడా మందులు వాడాల్సిందే. అయితే ఈ మందుల వల్ల బిడ్డ కొన్ని లోపాలతో పుట్టే ప్రమాదం ఉన్నందున గర్భధారణకు ముందునుంచే ఫోలేట్ అనే మందు తీసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు ఆ మందు వాడినా ప్రయోజం లేదు. మీ వైద్యుడిచ్చే సలహాలు పాటిస్తూ రెగ్యులర్‌గా స్కానింగ్ చేయించుకుంటే ఎడైలా లోపాలున్నా ముందుగా తెలిసిపోతుంది. డెలివరీ తర్వాత మరోసారి గర్భం దాల్చడానికి ముందు నుంచే ఫోలేట్ విటమిన్‌ను తీసుకోండి.


  • Q.నాకు యాభై ఏళ్ళు . ఆ మధ్య తుంటి, నడుము వద్ద చిన్న చిన్న గుల్లలు వచ్చి వాటంతట అవే మాడిపోయాయి. అయితే రెండు రోజుల నుంచి అక్కడే నాకు విపరీతమైన నొప్పి వస్తోంది. నా సమస్యకు కారణం ఏమై ఉంటుంది?
  • చెప్పిన లక్షణాలను బట్టి మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో ఉన్నట్లు అనిపిస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న మధుమేహుల్లో  ఇది రావచ్చు. జబ్బు వచ్చినపుడు మందులు వాడితే తగ్గిపోతుంది. ఇది మీరు భయపడాల్సినంత పెద్ద సమస్య కాదు . ఒకసారి మీ  డాక్టర్‌ను సంప్రందించి వారి సలహా పాటించండి. 


  • Q.మా పాప ఇంటర్ రాసింది. ఎంసెట్ పరీక్షకు సిద్దం అవుతోంది. ఈ మధ్య చదువు వదిలి పెట్టి ఎప్పుడూ మొబైల్, కంప్యూటర్ మీద గేమ్స్ ఆడుతుంది. అదేమని మందలిస్తే నాకు రాంక్ తప్పక వస్తుందని ధీమాగా చెబుతుంది. ఇంకా ఒత్తిడి చేస్తే నీకెందుకు? నీకేం తెలియదు అంటూ వాదనకు దిగుతోంది . మా పాప బుద్ధిగా చదువుకోవాలంటే ఏం చేయాలి?
  •  ఏకాగ్రతా లోపం వల్ల ఈ సమస్య వచ్చినట్లు అనిపిస్తోంది. ఇలాంటి వారు ఎక్కువ సమయం  ఒకే పని చేయలేరు. తీవ్రమైన భయం, ఆందోళన ఉన్న వారూ ఇలా ప్రవర్తించే అవకాశం ఉంది. పాపను ఒకసారి  సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి  కౌన్సిలింగ్ ఇప్పిస్తే మేలనిపిస్తోంది. 


Recent Stories