• HOME
 • ఆహ్లాదం
 • ఒత్తిడికి దారితీస్తున్నస్మార్ట్ ఫోన్ వినియోగం ..!

 

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? రోజుకు కనీసం రెండుమూడు గంటలైనా దానితో కాలక్షేపం చేస్తున్నారా? ప్రతి అయిదు పది నిమిషాలకోసారి మెసేజ్, సోషల్ మీడియా అప్ డేట్స్ చూస్తుంటారా? ప్రతి వాట్సప్ మెసేజ్ కూ జవాబిస్తారా?  అయితే మీరు రోజురోజుకూ తెలియనిరీతిలో ఒత్తిడికి గురవుతున్నట్లే. ఇటీవలి కాలంలో నిర్వహించిన పలు పరిశోధనల్లో తేలిన నిజమిది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, నిరాశ వంటి సమస్యల బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని  నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఈ తరహా ఒత్తిళ్ళ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ప్రధాన అంశాలు

 • అతిగా స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ఏ పనినీ సకాలంలో శ్రద్దగా చేయలేరు. దీనివల్ల పని చేసే సామర్ధ్యం, నాణ్యత రెండూ తగ్గుతాయి.అటు ఈ అలవాటూ మానుకోలేక, పనిమీదా దృష్టి పెట్టలేక సదరు వ్యక్తి వృత్తిపరమైన వెనకబాటుకు గురై నిరాశలో కూరుకుపోతాడు. 
 • ఏ చిన్న శబ్దం వచ్చినా తమ ఫోనే అనే భ్రమతో పదే పదే ఫోన్ చెక్ చేసుకోవటం, రాకపోతే నిరాశకు గురవుతూ ఉంటారు. తాము పదే పదే ఫోన్ చూసుకుంటుంటే చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అనే ఇబ్బందీ ఉంటుంది.
 • పదే పదే కాల్స్ వచ్చినప్పుడు పని ఒత్తిడిలో వాటికి తగినట్లు జవాబివ్వటం కుదరకపోతే కూడా తెలియని భయం, అలజడికి లోనవుతారు.
 • 24 గంటలూ సోషల్ మీడియా అప్ డేట్స్ ఫాలో అవుతూ, ప్రతి పోస్టుకూ జవాబు, లైక్ లేక  కామెంట్  పెట్టటం అలవాతుహ్గా మారి ఏకారణం చేతనైనా ఆ పని చేయలేక పోతే కోపం, నిరాశ వంటి వాటికి గురవుతూ ఉంటారు.
 • తీవ్రమైన రేడియేషన్, గంటల తరబడి బుల్లి స్క్రీన్ నే కళ్ళు రిక్కించి చూడటం వల్ల పలు అనారోగ్యాలతో బాటు కూడా కంటి చూపు దెబ్బతింటుంది.
 • ప్రేమికులు తాము పంపిన సందేశాలు,రహస్య సంభాషణలు కుటుంబీకులు చూస్తారేమోననే కంగారులో ఉంటారు. దీంతో ఎక్కడికి వెళ్ళినా ఫోన్ వెంట తీసుకుపోతారు. ఇది తెలియని అభద్రతా భావానికి గుర్తు.
 • తనకు నచ్చని అభిప్రాయాలను, మనసును గాయ పరచే పోస్ట్ చూసినప్పుడు తెలియని ఉద్రేకానికి లోనై ప్రతికూలమైన ఆలోచన బాట పడతారు.
 • సెల్‌ఫోన్‌ వల్ల జరుగుతున్నందున ఎవరైనా వింటారేమోననే ఒత్తిడికి లోనవుతారు.
 • అదేపనిగా ఫోన్‌ మాట్లాడటం వల్ల రేడియేషన్‌ ప్రభా వం శరీరం మీదే కాక మనసు మీద కూడా పడి ఒత్తిడి కి దారితీస్తుంది.
 • ఉన్నట్టుండి ఫోన్ చార్జింగ్ అయిపోయినా, ఇంటర్నెట్ సేవల అంతరాయం ఏర్పడినా తెలియని చిరాకుకు లోనవుతారు. ఒక్కోసారి ఇది స్నేహితులు, తోటివారిమీదకు మళ్ళి లేని పోని సమస్యలకు దారి తీయవచ్చు.
 • ఫోన్ వ్యసనం ఉన్నవారు డ్రైవింగ్ చేస్తూ కూడా దాన్ని వాడి పలు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఒత్తిడే దీనికి కారణం.
 • ఫోన్ వాడే వారు తోలి రోజుల్లో స్క్రీన్ను దూరం నుంచి చూస్తూ, క్రమంగా మెడ వంచి, కంటికి దగ్గరగా పెట్టి చూడటానికి అలవాటు పడతారు.
 • పిల్లలు గేమ్స్, ఇంటర్నెట్ మాయలో పడి తినే సమయంలోనూ ఫోన్ దగ్గరపెట్టుకోవటం, అతిగా తిని ఊబకాయం బారిన పడటం జరుగుతోంది. దీన్ని సరి చేసేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తే కుంగుబాటుకూ, తిరగబడటానికీ దారి తీస్తోంది.
 • ఎప్పుడూ ఫోన్ లోకంగా మారి సామాజిక, కుటుంబ, మానవ సంబంధాలకు దూరంగా మిగిలిపాయే ప్రమాదం కూడా ఉంది. 

సాంకేతికతను ఎప్పటికప్పుడు ఆహ్వానించాల్సిందే. అదే సమయంలో దానితో ముడిపడి ఉన్న ఏ అంశం వ్యసనంగా మారకూడదు. అవసరం, సౌకర్యం, విలాసం మధ్య ఉండే తేడాను అందరూ గుర్తించాలి. స్మార్ట్ ఫోన్ వినియోగం విషయంలో ఎవరికీ వారు స్వీయ నియంత్రణ పాటించగలిగితే ఎలాంటి ఒత్తిడీ లేకుండా దానిని చక్కగా సద్వినియోగం చేసున్నవారం అవుతాము.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE