అటు శరీరాన్ని, ఇటు ఆత్మనూ పరిశుద్ధం చేసే విశేష ప్రక్రియే ఉపవాసం. ఉపవాసము అంటే భగవంతునికి సమీపంగా నివసించటం అని అర్థం. పరమాత్మ ధ్యాసలో పడి అన్నపానీయాలను మరచిపోవటమే ఉపవాసం తప్ప బలవంతాన అన్నపానీయాలకు దూరంగా ఉం డటం కాదు. అన్ని మతాల్లోనూ ఉపవాస సంప్రదాయం కనిపిస్తుంది. ఏకాదశి రోజున, మహాశివరాత్రి, నవరాత్రుల వేళ చేసే ఉపవాసం విశేష ఫలితాన్నిస్తుందని హిందువుల నమ్మకం. ప్రతి మహమ్మదీయుడు రంజాన్ మాసంలో ఉపవాసం ఉండాలనీ, వీలు కాకపొతే కనీసం ఆ మాసంలోని శుక్రవారమైనా ఉపవాసం ఉండాలని ఖురాన్ చెబుతోంది.

వేర్వేరు పద్ధతులు

ఉపవాసం విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా పద్దతులు కనిపిస్తాయి. మంచి నీళ్ళు కూడా తాగకుండా చేసేది సంపూర్ణ ఉపవాసం. అందరికీ ఇది సాధ్యం కానిపని గనుక పాలు, కొబ్బరి నీరు వంటి కేవలం ద్రవాహారం తీసుకొనో లేక పండ్లు , పచ్చి కూరలు , వడపప్పు , చెరుకు ముక్కలు వంటి వండని పదార్దములు మాత్రమే తీసుకొని ఉపవాసం చేయటం, ఉడికించిన కూరగాయలు , గింజలు తో సహా అన్ని పానీయాలు తీసుకుని ఉపవాసం ఉండటం చేస్తారు. వీటిలో ఏ పద్ధతైనా మనసుపెట్టి ఏకాగ్రతతో చేయగలిగితే ఉపవాసపు మేలైన ఉపయోగాలను అందుకోవచ్చు.

ఇలా చేయాలి

ఆరోగ్యం బాగున్న వారు రెండు మూడు రోజులు ఉపవాసం చేయవచ్చు. అయితే ఏకబిగిన కాదు. తగిన సాధన లేకుండా నేరుగా తొలిసారే ఇలా ఉపవాసం ఉంటే ఆరోగ్యం, పుణ్యం సంగతి అటుంచి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ముందుగా తక్కువ భోజనం చేయటం, ఆ తర్వాత దశలో ఒక పూట భోజనం చేయటం, చివరిగా అల్పాహారంతో సరిపెట్టటం వంటివి సాధన చేసి ఆ తర్వాతే సంపూర్ణ ఉపవాసం చేయాలి.

ఉపయోగాలు

 • శరీర విధుల నిర్వహణనలో సమతుల్యత వస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మరింత శక్తివంతం అవుతుంది.
 • రక్త పీడనం త్వరగా తగ్గిపోతుంది. ఇది హైబీపీ ఉన్నవారికి మంచిదే అయినా లోబీపీ బాధితులకు మాత్రం సమస్యలు తేవచ్చు.
 • శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి ఉపవాసాన్ని, ఒక మంచి మార్గంగా పాటించవచ్చు.
 • ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు తగిన విశ్రాంతి దొరికి, దాని పనితీరు మెరుగుపడుతుంది.
 • ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకోవటం సాధ్యమవుతుంది.
 • భూతదయ, ఓర్పు, క్షమ వంటివి పెంపొందుతాయి.
 • • అదనపు కేలరీర బెడద లేనందున ఊబకాయం వంటి సమస్యలు రావు.
 • ఏళ్ళ పాటు ఉపవాసాన్ని ఒక దీక్షగా చేసేవారు నిత్య యవ్వనులుగా కనిపిస్తారు.

ఉపవాస విరమణ

 • ఉపవాసాన్ని నిమ్మరసం లేక పండ్ల రసం వంటి ద్రవాహారం తీసుకోవటం ద్వారానే విరమించాలి.
 • ఉపవాస విరమణ కాగానే పొట్టనిండా భోజనం చేయకూడదు.
 • ఉపవాసం తర్వాత సాత్వికమైన ఆహారం తీసుకోవటం అవసరం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE