వేషధారణ మన వ్యక్తిత్వాన్నిసూచిస్తుంది. నలుగురిలో మనకంటూ ఒక గుర్తింపునూ తెస్తుంది. కొన్ని రకాల ఉద్యోగాల్లో అయితే వేషధారణ చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. హుందాగా ఉండే వేషధారణతో ఉద్యోగి అటు కింది ఉద్యోగుల, పై అధికారుల దృష్టిని ఆకర్షించటంతో బాటు ఒక సానుకూలమైన అభిప్రాయాన్ని ఏర్పరచగలుగుతాడు. వేషధారణను బట్టి సదరు ఉద్యోగి వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచన విధానం ఏమిటో తోటివారు అంచనా వేయగలుగుతారు. అయితే ఇప్పటి రోజుల్లో ఇబ్బడిముబ్బడిగా విస్తరిస్తున్న ఫ్యాషన్‌ ప్రపంచపు ప్రభావం మూలంగా సందర్భాన్ని బట్టి దుస్తులు ధరించే విషయంలో చాలామంది కాస్త అయోమయానికి గురవుతున్నారు. ఇంటర్వ్యూ అభ్యర్థులు, కొత్తగా ఉద్యోగంలో చేరిన యువత ఈ విషయంలో మరింత గందరగోళానికి గురవుతున్నారు. అందుకే ఉద్యోగుల వేషధారణ విషయంలో తలెత్తే సందేహాలకు నిపుణులు ఇస్తున్న సమాచారం తెలుసుకుందాం.

ఇలా చేయండి

  • శరీరాకృతి, సైజుకు తగినట్లుగా డ్రెస్ కుట్టించుకోవాలి. రెడీమేడ్ వాడేవారు అవసరాన్ని బట్టి తగిన విధంగా రీ సైజు చేయించుకోవాలి. మరీ వదులుగానో లేక మరీ బిగుతుగా, పొట్టిగా ఉన్న దుస్తులు ఉద్యోగులకు పనికిరావు. వీలున్నంత మేరకు చక్కగా ఇస్త్రీ చేసిన ఫార్మల్ డ్రెస్ వేసుకుంటే హుందాగా, సౌకర్యంగా కూడా ఉంటుంది.
  • శరీర ఛాయను బట్టి కూడా దుస్తుల ఎంపిక మారుతుంది. నల్లగా ఉండేవారు బెదురు వేసే నిండు నారింజ, వంగపూవు రంగు, పసుపు, వంటి రంగుల దుస్తులు వేసుకోవటం వల్ల సదరు ఉద్యోగి పట్ల ఒక చులకన భావన కలిగే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ప్రముఖులను కలిసేటప్పుడు, బోర్డు మీటింగ్‌ సమ యాల్లో ఇవి అసలే పనికి రావు. ఇలాంటి సందర్భాల్లో మాట్లాడే వ్యక్తి మీదే అందరి దృష్టి ఉంటుందని గుర్తించి తగు రంగులను ఎంపిక చేసుకోవాలి.

  • కావాలనుకుంటే వీకెండ్ పార్టీ, ఫంక్షన్‌లలో, వేడుకలలో నిండు రంగు దుస్తులు వేసుకోవచ్చు. ఉద్యోగులకు తెలుపు, నలుపు, బూడిద రంగు, నీలం తదితర రంగుల దుస్తులు హుందాదనాన్ని తెస్తాయి.
  • దుస్తుల ఎంపిక విషయంలో పురుషులతో పోల్చినప్పుడు మహిళలు మరింత కంగారుపడుతుంటారు. ఉద్యోగులైన మహిళలు హుందాగా కనిపించేందుకు చీర, సల్వార్ కమీజ్ వంటివి ఎంపిక చేసుకోవటం మంచిది. 
  • చాలామందికి డియోడ్రెండ్ , పెర్‌ఫ్యూమ్‌లు వాడే అలవాటు ఉంటుంది. అయితే మరీ ఘాటైనవి వాడితే తోటి ఉద్యోగులు ఇబ్బంది పడతారనే విషయం గుర్తించుకోవా లి. అంతేగాక కొందరికి వాటితో అలర్జీ, తలనొప్పి తదితర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవచ్చు. దీనివల్ల తోటి ఉద్యోగులు మీ దగ్గరకు రావటానికి ఆసక్తి చూపకపోవచ్చు.
  • మహిళా ఉద్యోగులు నగల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. కార్పోరేట్ ఉద్యోగులైన మహిళలు వీలున్నంత సింపుల్ గా ఉండటం మంచిది. పెళ్ళిళ్ళు, పండుగల సమయంలో సంప్రదాయ ఆభరణాలు ఎంపిక చేసుకోవచ్చు. పురుషులు కూడా వీలున్నంత తక్కువ యాక్సరీస్‌ వాడటం మంచిది.

 

  • చక్కగా వేసుకునే మేకప్‌ మన అందాన్ని రెట్టింపు చేస్తుంది. మహిళలు మరీ ఎక్కువ మేకప్‌ వేసుకున్నా చూసేందుకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. వాటర్‌ప్రూఫ్‌ కాస్మొటిక్స్‌ వాడటం వల్ల చెమట పట్టినా, వర్షంలో తడిసినా అందంలో తేడా రాదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE