వేసవి సెలవులు పూర్తయే సమయం. రెండు నెలలుగా ఆటపాటలతో ఎంజాయ్ చేసిన పిల్లలు మళ్ళీ బడి గురించి కాస్త దిగులుపడే రోజులు. బడి విషయంలో పిల్లల్లో సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించి వారు ఎప్పటిలాగే ఈ సెలవుల అనంతరం ఉత్సాహంగా బడి బాట పట్టేలా చేయటంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. ఈ అంశం విషయంలో పెద్దలు దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం..

  • సెలవులు ఇంకా వారం ఉండగానే వారి దిన చర్యలో మార్పులు చేయాలి. బడికెళ్లే రోజుల సమయం ప్రకారం నిద్ర లేపటం, ఆహారం తీసుకోవటం, రాత్రిపూట  పాత సమయానికే నిద్ర పోయేలా అలవాటు చేయాలి.
  • పది రోజుల్లో బడి మొదలవుతుందనగానే రోజూ కొద్దిగా హోం వర్క్ ఇచ్చి చేయించటం, పాత సమయాల్లోనే టీవీ చూసేందుకు, ఆదుకునేందుకు అనుమతించాలి.
  • వారం ముందుగానే పుస్తకాలు, యూనిఫారం, షూస్ తదితరాలు సమకూర్చితే పిల్లలు సంతోషంగా బడిబాట పడతారు.
  • కొత్త ఏడాది కనీసం ముగ్గురిని మంచి స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలనీ, 100 శాతం హాజరు సాధించమనీ, ఏదో ఒక జట్టుకు ప్రాతినిధ్యం వహించేలా పిల్లల్ని ప్రోత్సహించాలి.
  • ఎండా కాలంలో పిల్లలు సరదాగా సాధన చేసిన ఈత వంటి వ్యాయామాలు, చెస్ వంటి ఆటలను సంవత్సరమంతా కొనసాగించేలా చూడాలి.
  • సెలవుల్లో పిల్లలు గీసిన బొమ్మలు, చూసిన కొత్త ప్రదేశాలు, చేసిన పనుల వివరాలను ఒక నివేదికగా తయారుచేయించి తోటి విద్యార్థులకు, టీచర్లకు చూపమని ప్రోత్సహించాలి.
  • సెలవులు పూర్తయ్యే ముందు పిల్లల్ని జంతుప్రదర్శన శాల, సముద్రం, నౌకాశ్రయం, విమానాశ్రయం వంటి కొత్త అనుభూతినిచ్చే ప్రదేశాలకు తీసుకుపోతే వారు బడి ఒత్తిడి నుంచి బయటపడతారు.
  • బడి మొదలైన తర్వాత పిల్లలు చదువుకునేందుకు ఒక గది లేక టేబుల్ ఏర్పాటు చేసి ముందుగానే అక్కడ మ్యాప్స్, రంగు పెన్నులు, అలారం, డిక్షనరీ, కాగితాలు వంటివి అమర్చాలి. దీని వల్ల పిల్లలకు బడి పట్ల ఆసక్తి పెరుగుతుంది.
  • బడి ఇంకా వారం ఉందనగానే పిల్లల చేత సుడోకు, పదకేళి వంటి మెదడుకు పదును పెట్టే సాధనాలు చేయిస్తే బద్ధకం వదిలి పోతుంది.
  • బడి రెండు మూడు రోజుల్లో మొదలవుతుందనగానే పిల్లల్ని బడికి తీసుకెళ్ళి వారు కూర్చునే గది, లైబ్రరీ, మైదానం తదితరాలను చూపించటం ద్వారా ఆ వాతావరణం అలవాటయ్యేలా చూడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE