• HOME
 • ఆహ్లాదం
 • అతిగా వీడియో గేమ్స్ ఆడితే ఇబ్బందులే

 పిల్లలకు వీడియో గేమ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ వీడియో గేమ్స్ లో కనిపించే ఎన్నడూ చూడని పాత్రలు,సాహసోపేతంగా సాగే పోరాటాలు వారికి చెప్పలేనంత థ్రిల్లింగ్ కలిగిస్తాయి. అయితే అదేపనిగా వీడియో గేమ్స్ ఆడే పిల్లలకు పలు రకాల శారీరక, మానసిక సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట్లోసరదా వ్యాపకంగా మొదలయ్యే వీడియో గేమ్స్ కొంతకాలం అయ్యేసరికి వ్యసనంగా మారుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. వీడియో గేమ్స్ వినోదం కలిగిస్తాయే తప్ప వీటివల్ల ఇతర ఆటల వల్ల పిల్లల్లో కలిగే నాయకత్వ లక్షణాలు, మానసిక సంతులనం, పరిపక్వత, సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని వారు వివరిస్తున్నారు. అందుకే వీడియో గేమ్స్ విషయంలో మీ పిల్లల ధోరణిని ఎప్పటికప్పుడు గమనించి వారు లేనిపోని సమస్యల బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రోజుకు  2 నుంచి 3 గంటల పాటు వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే పెద్దలు వారి పట్ల జాగ్రత్త వహించాలి .

 • ఏదైనా పని వద్దంటే అసహనానికి గురికావటం, మొండిగా అదే చేయటం, తిరగబడటం
 • ఎప్పుడూ గదిలోపల గడియ పెట్టుకొని ఉండటం, భోజనం కూడా తమ గదిలోనే కానిచ్చేయటం
 • ఆట ఓడిపోతే ఏడవటం, కోపగించుకోవటం, వస్తువులు విసిరికొట్టటం
 • స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులతో అత్యంత అవసరమైతే తప్ప మాట్లాడకపోవటం
 • కళ్ళు, మెడ, మణికట్టు కండరాల నొప్పి
 • తమలో తాము మాట్లాడుకోవటం, పరీక్షలు, హోం వర్క్ మొదలు ఏ పనిమీదా శ్రద్ధ, ఏకాగ్రత చూపలేకపోవటం
 • చెప్పేది విన్నట్టు కనిపించినా తిరిగి అడిగితే జవాబు చెప్పలేకపోవటం
 • ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లు కనిపించటం,
 • ఇంటికి ఎవరైనా వచ్చినా పట్టించుకోకుండా గేమ్ ఆడుతూ ఉండటం
 • ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఆసక్తి చూపకపోవటం

పెద్దల బాధ్యత

పైలక్షణాలు కనిపించిన సందర్భాల్లో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...

 • పిల్లలు ఒక్కొక్కరూ ఒక్కో గదిలో ఉండటానికి బదులు అందరికీ ఒకే గది ఇవ్వటం
 • దినచర్యను ఖచ్చితంగా అమలయ్యేలా చూడటం
 • కంప్యూటర్ పిల్లల గదిలో గాక హాల్లో ఉంచటం, ఒక వయసు వచ్చేవరకు వ్యక్తిగత మొబైల్ లేకుండా చూడటం
 • రోజూ బడి నుంచి పిల్లలు రాగానే వారితో తల్లిదండ్రులు ఆ రోజు విశేషాలు ముచ్చటించటం
 • రోజుకు కేవలం 1 గంట మాత్రమేకంప్యూటర్‌ వాడుకునేందుకు అనుమతించటం
 • వారిష్టపడే సంగీత వాయిద్యం కొనిచ్చి రోజూ సాధన చేసేలా చూడటం
 • పిల్లలను వెంటబెట్టుకొని మైదానానికి తీసుకుపోయి ఆటలు ఆడించటం, పెద్దలూ వారితో కలిసి ఆడటం
 • సెలవు దినాల్లో పిల్లలను మ్యూజియాలు, పార్కులు, విహారయాత్రలకు తీసుకుపోవటం 

ఈ జాగ్రత్తలు పాటించినా కొందరు పిల్లల్లో ఎలాంటి మార్పూ కనిపించదు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించటం అవసరం. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE