మనిషి సంఘజీవి. సమాజంతో ఒక బలమైన బంధాన్ని ఏర్పరుచుకొని, దాన్ని కొనసాగించటం ద్వారా మనిషి తన మనుగడను నిలుపుకోవటమే గాక మిగిలిన ప్రాణుల కంటే సుఖమయ జీవితాన్ని పొందగలిగాడు. బాల్యంలో తల్లిదండ్రులతో మొదలయ్యే ఈ మానవ సంబంధాలు క్రమంగా   తోబుట్టువులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, సంతానం వంటి ఎన్నో బంధాలుగా విస్తరిస్తూ పోయేకొద్దీ మనిషి వాటిని నేర్పుగా సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. అయితే అవగాహనా రాహిత్యం కారణంగా ఒక్కోసారి పూల తీగెల్లా సంతోషాన్ని కలిగించే ఈ బంధాలు ముళ్ళకంపలుగా మారి మనిషిని అతలాకుతలం చేస్తాయి. అలాంటి సందర్భాల్లో బంధాల నుంచి పారిపోయేందుకు బదులు వాటిని తగు మార్గాల ద్వారా సమన్వయ పరుచుకోవటం ద్వారా  బలోపేతం చేసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. ఈ నేపథ్యంలో మానవసంబంధాలను బలోపేతం చేసే కొన్ని అంశాల గురించి అవగాహన చేసుకుందాం. 

ముఖ్యాంశాలు

  • బంధం ఏదైనా భాగస్వాములు ఒకరిపట్ల మరొకరు నమ్మకాన్ని కలిగివుండాలి. ఏ బంధానికైనా పునాది ఇదే.
  • బంధాలను కొనసాగించే క్రమంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి తప్పనిసరి.
  • లాభాపేక్ష లేని బంధాలే సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి.
  • బంధాలు బలపడటంతో చిన్న చిన్న త్యాగాలు కీలకపాత్ర పోషిస్తాయి.
  • భాగస్వామితో అవగాహన తగ్గేకొద్దీ బంధం బలహీనపడుతుంది.
  • తరచూ కలుసుకొని మాట్లాడుకోవటం, ఏమైనా ఇబ్బంది కలిగించే అంశాలుంటే చర్చించుకోవటం ద్వారా బంధాలు బలపడతాయి.

 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

జపమూ యజ్ఞమే

పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప 

MORE