రోజంతా పనిచేసి అలసిన మనిషికి గొప్ప ఉపశమనం.. నిద్ర. వారి వారి వృత్తలను బట్టి మనిషికి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్ర అవసరం. మెదడు పనితీరు బాగుండేలా చేయటం మొదలు శరీరంలోని సకల జీవక్రియల మీద నిద్ర ప్రభావం ఉంటుంది. ఎన్నోరకాల మానసిక సమస్యలకు నిద్రలేమి ప్రధానకారణంగా ఉంటుంది. మంచి నిద్రకు దోహదం చేసే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిట్కాలు

  • రోజూ ఒకేవేళకు నిద్రకు ఉపక్రమించటం, లేవటం అలవరచుకోవాలి.
  • సాయంత్రం 6 తర్వాత అతిగా కాఫీ,టీ, కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.
  • రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.
  • మీ బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గాడి ఉష్ణోగ్రత సమంగా ఉండేలా చూసుకోవాలి. గడిగోడలకు తేలికపాటి, ఆహ్లాదకరమైన రంగులు వేసుకోవం మంచిది.
  • నిద్రకు ముందుటీవీలో ఉద్వేగం కలిగించే సినిమాలూ, సీరియల్స్చూడొద్దు.
  • పగటి పూట కనీసం అరగంట పాటైనా లేత ఎండలో గడపగలిగితే మంచి నిద్ర పడుతుంది.
  • నిద్రకు ముందు నచ్చిన సంగీతాన్ని మంద్రస్థాయిలో వినటం మంచిది.
  • పాలలో ఉండే ';ట్రిప్టోఫ్యాన్'అనే అమైనో ఆసిడ్ సుఖనిద్రకు దోహదపడుతుంది. అందుకే నిద్రకు అరగంట ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగాలి.
  • నిద్రకు ముందుపుస్తకం చదివితే త్వరగా నిద్రపడుతుంది చాలామంది అనుకుంటారు గానీ అది అపోహే. ఇది అలవాటుగా మారితే కొన్ని అర్థరాత్రి వరకునిద్రపట్టకపోయే ప్రమాదం ఉంటుంది.
  • పొగతాగే అలవాటుకు స్వస్తి చెప్పాలి.
  • నిద్రకు ముందు మద్యపానం పనికిరాదు. ఒకవేళ నిద్రపట్టినా గాఢ నిద్ర మాత్రం కాదు. అందుకే మద్యం తాగినవారు మరునాటి ఉదయం ఉల్లాసంగా కనిపించరు.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE