• HOME
 • ఆహ్లాదం
 • కంప్యూటర్‌ గేమ్స్‌ మితిమీరితే ఇబ్బందే

ఇప్పటి పిల్లలకు కంప్యూటర్‌ గేమ్స్ అంటే ప్రాణం. ఈ గేమ్స్ ప్రమాదాలకు తావులేని, చెప్పలేనంత వినోదం కలిగించే మాట నిజమే అయినా పిల్లలు ఎక్కువ సమయం  కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడితే నేత్ర సమయాలతో బాటు మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో మైదానంలో ఆడే ఆటల ద్వారా కలిగే సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని చెబుతున్నారు. చాలామంది పిల్లల్లో ఈ గేమ్స్ ఒక వ్యసనంగా మారుతున్నాయనీ, దీనివల్ల పిల్లలు ఏకాకులుగా మారతున్నారనీ, కుటుంబ సభ్యులతో గడపటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారని వారు వివరిస్తున్నారు. 

గమనించాల్సిన మార్పులు 

 • మణికట్టు, మెడ నొప్పి
 • మానసిక ఒత్తిడి, తీవ్రమైన కుంగుబాటు
 • భావోద్రేకాల్లో చెప్పలేనంత మార్పులు
 • ఆడనివ్వక పోతే పెద్దల మీద తిరగబడటం
 • ఎలాంటి వినోద కార్యక్రమాలలో పాల్గొనకపోవటం
 • స్నేహితులతో ముభావంగా ఉండటం
 • భోజనం తమ గదిలోనే కానిచ్చేయటం
 • హోంవర్క్‌ చేయకపోవటం
 • పాఠాల పట్ల శ్రద్ధ చూపకపోవటం 

తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు

 • తల్లిదండ్రులు రోజూ కనీసం గంట సమయం పిల్లల బాగోగుల కోసం కేటాయించాలి.
 • కంప్యూటర్‌ వాడుకొనే సమయాన్ని పరిమితం చేయటం, అందరూ తిరిగే ప్రాంతంలోనే కంప్యూటర్‌ను ఉంచటం మంచిది.
 • పిల్లలతో కలిసి రోజూ అరగంట పాటు షటిల్, వాలీబాల్ వంటి ఆటలు ఆడాలి.
 • పిల్లలతో కలిసి వారాంతాల్లో విహారయాత్రలకు వెళ్తుండాలి.
 • పిల్లలకు సంగీతఎం, సాహిత్యం, చిత్ర లేఖనం వంటి వ్యాపకాలు అలవాటు చేయాలి.
 • పిల్లలను వీలున్నంత మేరకు రోజువారీ పనుల్లో బిజీగా ఉంచాలి.Recent Storiesbpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE