మనిషిలోని అసంతృప్తిని వెల్లడించే ప్రతికూలమైన వ్యక్తీకరణే కోపం. ప్రపంచంలోని ఏ మనిషీ దీనికి అతీతుడని చెప్పలేము. కోపంగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరును కోపం తగ్గిన తర్వాత  మన మూర్ఖత్వమని అంగీకరించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతుంది .  అందుకే కోపమనే శత్రువును ప్రతిఒక్కరూ ప్రయత్నపూర్వకంగా  నియంత్రించుకోవాలి. ఇది ఎవరికి  వారు చేయాల్సిన పని. 

కారణాలు

  • శరీరానికి, మనసుకు తగిన విశ్రాంతి లేకపోవడం.
  • చేదు జ్ఞాపకాలు మనసును గందరగోళ పరచటం
  • మనలోని లోపాలను, చేసిన తప్పులని అంగీకరించలేకపోవడం.

పరిష్కారాలు

  • కష్టించి పని చేయటం, ఏ ఫలితమైనా స్వాగతించటం అలవరచుకుంటే కోపం రాదు.
  • రోజూ క్రమం తప్పక చేసే యోగ సాధన వల్ల శారీరక, మానసిక దృఢత్వం చేకూరి కోపం వంటి అంతిమంగా తీవ్రమైన భావోద్వేగాలు దూరమవుతాయి.
  • రోజూ కనీసం 6 నుంచి 8 గంటల సమయం తప్పక నిద్రకు కేటాయించటం ద్వారా కోపాన్ని నియంత్రించవచ్చు.
  • కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం, సంగీతం వినటం, వ్యాయామాలు చేయటం మంచిది.
  • స్నేహితులతో సరదాగా గడపటం, ఇష్టమైన భావాలను రాయటం, తోటపని, పెంపుడు జంతువుల ఆలనాపాలనా చూడటం వల్ల సున్నితమైన భావాలు ఏర్పడతాయి.



Recent Stories







bpositivetelugu

చిన్నారుల్లో మానసిక ఒత్తిళ్లు

విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ

MORE
bpositivetelugu

జంటనగరాల బోనాల వేడుకలు

ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ,

MORE