సంక్రాంతి తోలి రోజైన భోగి నాడు పిల్లలకు భోగిపళ్లు పోయటం తెలుగు వారి సంప్రదాయం. సాధారణంగా భోగినాటి సాయంత్రం సమయంలో ఈ భోగిపళ్ల వేడుక ఉంటుంది. ఈ సందర్భంగా చిన్నారులకు తలస్నానం చేయించి కొత్త బట్టలు ధరింపజేస్తారు. తరువాత కృష్ణుడి ప్రతిమ లేదా ఫోటో ముందు పూజ చేసి నైవేద్యం పెట్టి చిన్నారుల చేత నమస్కారం చేయిస్తారు. ఇప్పుడు ఒక పళ్లెంలో కలిపి పెట్టుకొన్న రేగిపళ్ళు, నానబెట్టిన సెనగలు, తేగ ముక్కలు, చెరుకు ముక్కలు, బంతి పూల రెమ్మలు, చిల్లర డబ్బులను గుప్పెడు చొప్పున తీసుకొని ముందుగా కృష్ణయ్యకు పోసి అనంతరం చిన్నారులకు పోస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగిపళ్లు కేవలం చిన్నారులకు గాక వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు తమ పిల్లలకు భోగిపళ్లు పోస్తారు.  ఈ భోగి పళ్ళ వేడుకకు పేరంటాళ్ళు, బంధువులు, ఇరుగు పొరుగు పిల్లలను ఆహ్వానించి కార్యక్రం చివర వారికీ కొన్ని భోగిపళ్ళతో బాటు తాంబూలం ఇవ్వటం ఆనవాయితీ.

ప్రయోజనాలు

  • ఈ సీజన్లో రేగు పళ్ళు తింటే రోగ నిరోధక శక్తి పెరిగటంతో బాటు ఆకలీ పెరుగుతుంది. రేగుపండ్లు తినడం వలన రక్తకణాల సంఖ్య పెరగటమే గాక మానసిక ఒత్తిడి దరిజేరదు.
  • మనిషి శరీరంలో ఉండే 7 చక్రాల్లో శిరస్సు పై భాగాన ఉండే బ్రహ్మరంధ్రం చివరిది. ఈ భాగంలో భోగి పండ్లను పోయటం వల్ల ఆ చక్రం ప్రేరిపితమై పిల్లలు జ్ఞానవంతులవుతారని పెద్దల నమ్మకం.
  • సంస్కృత భాషలో బదరీ వృక్షంగా పిలిచే రేగు చెట్టును, దాని ఫలాలనువిష్ణు స్వరూపాలుగా భావిస్తారు. వాటిని తల మీద పోయడం వలన ఆ స్వామి అనుగ్రహం పిలల్లకు కలిగి వారికి నర దృష్టి బెడదతో బాటు ఇతర ప్రతికూల శక్తుల ప్రభావాలు ఉండవు.
  • రేగు పళ్ళను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటమని పెద్దల విశ్వాసం.
  • ఈ సంప్రదాయం ద్వారా ప్రకృతిలో లభించే అనేక రకాల పండ్లు, పూల గురించి పిల్లలకు అవగాహన, ప్రకృతి పట్ల గౌరవం పెరుగుతాయి .Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE