ఏటా మార్చి 8 నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. విదేశాల్లో వందేళ్లనాడు మొదలైన ఈ సంప్రదాయం మన దృష్టికి రావటానికి చాలా సమయమే పట్టింది. అయితే .. కాస్త ఆలస్యంగానైనా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క అవసరాన్ని గుర్తించి ఈ రోజు మహిళల వర్తమాన సమస్యలు, ఆయా రంగాల్లో వారు సాధించిన విజయాలు, వారు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను పలు కోణాల్లో విశ్లేషించి సమాజం ముందు పెట్టే గొప్ప ప్రయత్నం జరగటం నిజంగా సంతోషించాల్సిన విషయం. అన్ని రంగాల్లోనూ పురుషులకు పోటీగా రాణిస్తున్నా మహిళల విషయంలో పలురూపాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితి మరింతగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి మహిళలకు సమాన అవకాశాలు, పూర్తి స్వేఛ్చ అందించగలిగితే పురుషుల కంటే గొప్పగా రాణించగలరని ఇప్పటికే నిరూపితమైన నేపథ్యంలో ... అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికత. అసాధారణ విజయాలతో చైతన్యస్ఫూర్తులుగా నిలిచిన, నిలుస్తున్న మహిళామూర్తులకు అభినందనలు తెలియజేస్తూ.. ఈ ఏడాది సైతం ఇలాంటి  మరిన్ని విజయ గాథల్ని వినాలని ఆకాంక్షిస్తూ.. 

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE