• HOME
  • ఆహ్లాదం
  • హోలీ కేళిలో పాటించాల్సిన జాగ్రత్తలు 

హోలీ పండుగ అనగానే చెప్పలేనంత ఉత్సాహం వచ్చేస్తుంది. అయితే.. ఈ పండుగను పర్యావరణహితంగా, ప్రమాద రహితంగా జరుపుకొన్నప్పుడు ఆ ఉత్సాహం ఒక జీవితకాలపు మధురానుభూతిగా, ఆనందమయ కేళిగా మిగులుతుంది. అందుకోసం పాటించాల్సిన కొన్ని ముఖ్య సూచనలు.. 

  • రంగులు కలిపేందుకు మంచినీటినే వాడాలి. కలుషిత నీటిని వాడితే చర్మ సమస్యలు తప్పవు.
  • చౌకబారు రంగుల్లో పారిశ్రామిక రసాయనాలు వాడుతారు. అందుకే ఆర్గానిక్ కలర్స్ నే వాడటం మంచిది.
  • హోలీ రోజు పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచే దుస్తులు ధరిస్తే రంగులు నేరుగా శరీరాన్ని తాకే అవకాశం ఉండదు .
  • మహిళలు రంగులు పూసుకోకముందే జుట్టుకు కొబ్బరినూనె రాసుకొని ముడిపెట్టుకొంటే రంగు అంతటా అంటకుండా ఉంటుంది. అంటిన కొద్దిపాటు రంగూ తలస్నానం చేస్తే సులభంగా వదిలిపోతుంది. ఒంటికీ నూనె పట్టిస్తే రంగులు లోపలి ఇంకే ప్రమాదం ఉండదు.
  • ఎరుపు, పింక్ రంగుల గాఢత తక్కువ గనుక వెంటనే స్నానం చేస్తే తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులైతే ఒక పట్టాన వదలవు.
  • హోలీ వేళ కోడిగుడ్లు కొట్టడం, పేడ, బురద నీరు చల్లడం, రంగునీళ్లు తొట్టిలో స్నేహితుల ముఖాలను ముంచటం చేయకూడదు.
  • పొడి రంగులు చల్లుకోవడం కంటే రంగు నీటిని పిచికారి చేయటం మంచిది.
  • స్కిన్ ఎలర్జీలు, ఆస్తమా, కాంటాక్ట్ లెన్స్ ఉన్నవారు హోలీకి దూరంగా ఉండాలి.
  • గోరింటాకు పొడి, పసుపు, కుంకుమ, చందనం వంటివి కలుపుకున్న నీళ్లతో హొలీ ఆడితే రసాయనాల బెడద తప్పినట్లే.
  • మోదుగ, తంగేడు, మందార, గన్నేరు పూలను నీటిలో నానబెట్టి చేసిన రంగులైతే మరీ మంచిది.
  • రంగుల వేడుక ముగిసిన తర్వాత వాహనాల మీద ఎక్కువ సేపు ఎండలో తిరిగితే అనారోగ్యం తప్పదు.
  • చిన్నారులు రంగులు చల్లుకొనే సమయంలో పెద్దలు పర్యవేక్షించాలి. 
  • తర్వాత 3 రోజుల వరకు స్టీమ్‌ బాత్ కు దూరంగా ఉండాలి. 2 రోజుల తరువాతే ఫేషియల్‌ చేయించుకోవాలి. అయితే బ్లీచ్‌, రసాయనాలు వాడకూడదు. ఆవిరి పట్టకూడదు.



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE