రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించాలంటే రోజూ కాసేపు తోటపని చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పచ్చని చెట్లు, విరబూసిన పూలమొక్కల మధ్య తిరగటం, వాటి బాగోగులు చూడటం వల్ల ఎంతటి ఒత్తిడైనా క్షణాల్లో ఎగిరిపోతుందని వారు సూచిస్తున్నారు. తోటపని ప్రయోజనకర౦గా, ఆసక్తికర౦గా ఉ౦డడమే కాక వ్యాయామశాలలో చేసే వ్యాయామ౦ కన్నా మ౦చి వ్యాయామ౦ కూడా. తోటపని వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం. 

  • ఉదయం, సాయంత్రం వేళల్లో అరగంట పాటు తోటపని చేస్తే ఒంట్లోని అదనపు క్యాలరీలు ఖర్చయి, రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
  • మూడ్‌ సమస్యల బాధితులు నేలను తవ్వడం, మొక్క నాటడం, నీళ్లు పోయడం.. వంటి పనులు కుదిరినప్పుడల్లా చేయడం వల్ల మనసు ఆనందంగా మారుతుంది.
  • తోటపని వల్ల తగినంత సమయం ఆరుబయట గడుపుతారు గనుక స్వచ్ఛమైన గాలి, వెలుతురును ఆస్వాదించవచ్చు. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి సమస్యలు రావు.
  • వృద్ధులు తోటపని చేయటం వల్ల భవిష్యత్తు విషయ౦లో సానుకూల ధోరణి ఏర్పడి ఆయుః ప్రమాణం పెరుగుతుంది.
  • ఆసుపత్రిలో చికిత్స తర్వాత రోగులు అక్కడి పచ్చని చెట్లను చూడగలిగినా మంచి ఫలితం ఉంటుంది.
  • మూడ్‌ సమస్యల బాధితులు నేలను తవ్వడం, మొక్క నాటడం, నీళ్లు పోయడం.. వల్ల మనసు ఆనందంగా ఉంటుంది.
  • పెరటి మట్టిలో ఉండే కొన్నిక్రిములు మనసుకు ఉత్సాహాన్నిచ్చే సెరటోనిన్‌ రసాయనాన్ని విడుదల చేస్తాయి.
  • రోజూ లాన్‌లో కొద్దిసేపు గడిపినా ఒత్తిడి తొలగిపోవటమే గాక సరికొత్త, సృజనాత్మక ఆలోచనలు అంకురిస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE