• HOME
  • ఆహ్లాదం
  • పిల్లల భాషా నైపుణ్యాలు పెరిగేదెలా? 

భావ వ్యక్తీకరణకు భాష ప్రధాన మాధ్యమం. భాషను ఎలా ఉపయోగించాలో తెలిసిన పిల్లల భావ వ్యక్తీకరణ మిగిలిన వారికంటే ఎంతో ప్రభావశీలంగా ఉంటుంది. నేటి ఆధునిక యుగంలో భాషా నైపుణ్యాలు గల వారే వృత్తిఉద్యోగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే.. చిన్ననాటి నుంచే పిల్లల భాషా నైపుణ్యాల మీద తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని ఈ దిశగా ప్రోత్సహించాలి. 

సాధారణ మార్పులు

మాటలు రావటంతోనే  పిల్లలు ఇతరుల మాటలను, హావభావాలను అనుకరించటం మొదలు పెడతారు. ఈ దశలో పిల్లలను ఎత్తుకుని తిప్పుతూ ఇంట్లోని వస్తువులను చూపిస్తూ వాటి పేర్లు చెప్పించాలి. రెండో ఏటి నాటికి పిల్లలు కొంత స్పష్టంగా మాట్లాడుతారు. అప్పుడు వారికి జోలపాటలు వినిపించటం, రంగులు, బొమ్మలు, జంతువుల పేర్లు చెప్పటం, అడిగినదానికి జవాబివ్వమని ప్రోత్సహించటం, బంధువులు, ఇరుగుపొరుగు వారిని గుర్తుపట్టి వరుసతో పిలిచేలా తర్ఫీదునివ్వటం వంటి అంశాల్లో పెద్దలు బాగా ప్రోత్సాహమివ్వాలి. మూడో ఏటికి టీవీలో చూసి స్వయంగా పాటలు పాడటం, తాము చూసిన కొత్త విషయాలు చెప్పటం, ఇంటిలోపలి వస్తువులు, వినియోగం, ఇంట్లో వారు మాట్లాడుకొనే విషయాల పట్ల కొద్దిపాటి స్పష్టత పొందుతారు. నాలుగో ఏడు నిండేనాటికి సుదీర్ఘమైన సంభాషణలు తిరిగి చెప్పటం, పెద్దల మాదిరిగా తడబాటు లేకుండా మాట్లాడటం, బయట జరిగినవి చెప్పటం, కావాల్సినవి అడగటం, పేరు, వయస్సు, తల్లిదండ్రుల పేర్లు, ఇంటి చిరునామా చెప్పగలుగుతారు. ఇంకా ప్రోత్సహిస్తే స్నేహితులతో కలిసి పాటలు పాడటం, చిన్న చిన్న డైలాగులు తిరిగి చెప్పటమూ చేస్తారు. ఆరో ఏటికి కథలు, చూసిన సినిమా విశేషాలు చెప్పటంతో బాటు వాటిలో తెలియని అంశాలను పెద్దలను అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. సినిమా నటులు, నాయకులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి పేర్లను చెప్పి మళ్ళీ అడిగితే వెంటనే చెప్పగలగటమే గాక వారెప్పుడు కనిపించినా వారిని గుర్తుపడతారు.  

పెద్దల బాధ్యతలు

పై రీతిలో పిల్లల్లో భాషాపరమైన అభివృద్ధి ఉండాలంటే పెద్దలు ఈ దిగువ అంశాల మీద ప్రత్యేక శ్రద్ద చూపాలి. 

  • పిల్లల ముందు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, సరైన పద్ధతిలో ఉచ్ఛరించాలి.
  • పిల్లలు ఏదైనా మాట్లాడుతుంటే వారించకుండా స్వేచ్ఛగా మాట్లాడేలా చూడాలి.
  • పిల్లల కోసం కొత్త విషయాలు తెలుసుకొని వారికి వివరించే ప్రయత్నం చేయాలి.
  • ఇంట్లో పిల్లల కోసం ఆటబొమ్మలు, బొమ్మల పుస్తకాలు, దిన పత్రికలు అందుబాటులో ఉంచాలి.
  • రేడియో, టీవీ లలో మంచి సంభాషణ, కథలు, పాటలు వినే అవకాశం కల్పించాలి.
  • పెద్దలతో, ఇతర పిల్లలతో చొరవగా మాట్లాడేలా ప్రోత్సహించాలి.
  • ఇరుగుపొరుగు పిల్లలతో కాసేపైనా ఆడుకొనే, తిరిగే అవకాశం కల్పించాలి.
  • పిల్లలను పార్కులకు, ఇతర కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లి అక్కడి విశేషాలను వివరించాలి.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE