మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు. నాడీ వ్యవస్థను ఉత్తేజ పరచి ఎంతటి మానసిక ఒత్తిడినైనా దూరం చేయటం, ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకు, మనపట్ల ఒక సానుకూల భావన కలిగేందుకూ పరిమళాలు దోహదపడతాయి. అయితే వీటి వినియోగంలో తగు జాగ్రత్తలు పాటించకపోతే కొన్ని సమస్యలూ ఎదురు కావచ్చు. పరిమళాల్లోని రకాలు, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

రకాలు

పరిమళాల తయారీ, సువాసనలను బట్టి వీటిని ఆయా పేర్లతో పిలుస్తారు. ఫోరల్‌... అంటే పువ్వుల నుంచి చేసేవి. వీటిని స్త్రీలు ఎక్కువగా వాడతారు. ప్రూటీ. అంటే తాజా పండ్ల సువాసనలనిచ్చేవి. మరో రకం.. ఓషనిక్‌. రసాయనాలతో చేసే ఈ రకం వాడితే సముద్రం, దాని చుట్టు పక్కల వాతావరణం గుర్తుకొస్తాయి. గ్రీన్‌ అనేది వాడితే ప్రకృతిలో లీనమైన భావన కలిగి కొత్తశక్తి వచ్చినట్లవుతుంది. గాఢత ఎక్కువగా ఉండి అడవుల్లోని చెట్ల బెరళ్ల వాసనలను కలిగి ఉండేది ఉడీరకం. ఇలా మరెన్నో. 

సీజన్, సందర్భాన్ని బట్టి ఎంపిక

  • ప్రేమ భావనలు పొంగి పొరలే వసంత రుతువులో ఫ్లోరల్‌ సెంట్లు వాడాలి.
  • వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పరిమళాల తీవ్రత ఎక్కువ గనుక తక్కువ గాఢత గల, చల్ల దనాన్నిచ్చే సిట్రస్‌ పరిమళాలు వాడాలి.
  • ఆకురాలే కాలంలో ప్రూటీ, ఉడీ పరిమళాలు ఉల్లాసాన్నిస్తాయి.
  • బద్ధకంగా ఉండే చలికాలంలో ఉత్సాహాన్నిచ్చే ఊడీ రకం నప్పుతుంది. 

ఇతర జాగ్రత్తలు 

  • పెర్ ఫ్యూమ్ వాడే ప్రతిసారీ బాటిల్ ను షేక్ చేయాలి. అప్పుడే సమాన గాఢత తో వస్తుంది.
  • పెర్‌ఫ్యూమ్‌ కొనేటప్పుడు తప్పనిసరిగా ప్యాచ్‌టిస్ట్‌ చేసుకోవాలి. దీనివల్ల ఎలర్జీ ఉన్నా ముందే తెలుసుకోవచ్చు.
  • నాణ్యమైన పెర్‌ఫ్యూమ్‌ చేతికి రాసుకున్న 15 నిమిషాల తర్వాతా మంచి వాసన వస్తుంది. లేకుంటే కల్తీ అని అర్ధం.
  • గతంలో వీటి వినియోగంతో అలర్జీ, చర్మ సమస్యలు, మైగ్రేన్‌ తలనొప్పి ఉంటే వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • చంకల క్రింద, మర్మాంగాల వద్ద నేరుగా గాఢమైన పెర్ ఫ్యూమ్ వాడకూడదు.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE