సౌందర్య, సౌభాగ్య చిహ్నమైన గోరింటాకు ఎంతో ఆరోగ్యదాయకమైంది. దీనిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకొంటే ఔరా అనకుండా ఉండలేము. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆరోగ్య పరిరక్షణకు గోరింట చేసే మేలు గురించి తెలుసుకుందాం. 

  • వాననీటిలో తిరిగినప్పుడు కాళ్ళు నాని ఇన్ఫెక్షన్ వల్ల వేళ్ళమధ్య పుండ్లు, గోళ్లు పుచ్చిపోవటం, గోరుచుట్టు వంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే గోరింటాకు రుబ్బి కాలికి పెట్టుకోవాల్సిందే. దీనివల్ల పగిలిన మడమలూ సున్నితంగా మారతాయి.
  • నువ్వుల నూనెలో గోరింటాకు మరిగించి తలకు రాసుకుంటే కళ్ళుమంటలు, తలనొప్పి, వెంట్రుకలు తెల్లబడడం తగ్గుతుంది.
  • గాయమై రక్తం కారుతున్న చోట , కీళ్ళనొప్పులు, వాపులకు గోరింటాకు నూనె పైపూతగా వాడితే మంచిగుణం కనబడుతుంది.
  • శరీరంలో వేడి పెరిగినప్పుడు అరికాళ్ళ నిండా గోరింటాకు పట్టిస్తే వేడి తగ్గిపోతుంది.
  • గోరంటాకు పెట్టుకొన్న మహిళల్లో మానసిక ఒత్తిడి దూరమైనట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE