• HOME
 • ఆహ్లాదం
 • మానసిక ఒత్తిడికి విరుగుడు.. హెడ్ మసాజ్

ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ఎంతోకొంత వృత్తిపరమైన ఒత్తిడిని ఎదుర్కోవటం సహజమే. ఈ ఒత్తిడి పెరిగేకొద్దే అది భరించలేని, విడువని తలనొప్పికి దారితీస్తోంది. పనిఒత్తిడి, పెరుగుతున్న ప్రమాణాలు, పోటీకి అనుగుణంగా పనిచేయాల్సిరావటం, కాలుష్యం, ట్రాఫిక్ ప్రయాణాల వల్ల ఈ తలనొప్పి భరించలేనిదిగా మారి రోజువారీ దినచర్యను దెబ్బతీస్తోంది. 

ఒత్తిడి తెచ్చే తంటాలు

విడవని తలనొప్పుల వల్ల ఏకాగ్రత లోపంతో బాటు భావోద్వేగాల్లోనూ ప్రతికూలమైన మార్పులు వస్తాయి. దీంతో సహోద్యోగులతో సఖ్యత తగ్గటం, వివాదాలు ఏర్పడటం వంటి సమస్యలు తప్పవు. సదరు ఉద్యోగి ఎంత కష్టపడినా, అతని వైఖరి వల్ల పడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు. వీరిలో చాలామందికి మసాజ్ గురించిన అవగాహన లేక ఏళ్లతరబడి ఆ తలనొప్పులను భరిస్తూ ఉంటారు. తొలిదశలోనే వీరు మసాజ్ ను ఆశ్రయిస్తే మంచి ఆరోగ్యంతో బాటు సామాజిక సంబంధాలూ బాగుంటాయి. 

 హెడ్ మసాజ్ పద్ధతి

 • ఒత్తిడిని తగ్గించుకునేందుకు హెడ్ మసాజ్ కోరుకునేవారు గోరువెచ్చని కొబ్బరి, ఆలివ్, ఔషధ నూనెలు వాడొచ్చు. తలనొప్పి బాధితులు మాత్రం సుగంధ భరిత నూనెలు మసాజ్ కోసం వాడరాదు. బహు సున్నితమైన చర్మం లేదా జిడ్డు చర్మం ఉన్నవారు నూనెకు బదులు పెరుగు, నిమ్మరసం, పాలతో మసాజ్ చేసుకోవచ్చు.
 • సౌకర్యంగా కూర్చొని కొద్దికొద్దిగా నూనెను అరచేతిలోకి తీసుకొని మాడుకు రాసి , జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఆ తర్వాత మునివేళ్లతో మాడును నెమ్మదిగా బాగా మర్దన చేయాలి. మరీ ఎక్కువ వేగంతో రుద్దితే జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. మాడు, తల వేడెక్కేవరకు మసాజ్ కొనసాగించాలి.
 • మసాజ్ సమయంలో ప్రశాంతంగా కళ్ళుమూసుకొని దాన్ని ఆస్వాదించాలి. మాడు మీద మసాజ్ అయినా తర్వాత నుదురు, కణతలు, మెడ, భుజం భాగాల్లో మసాజ్ చేసుకోవాలి. ఇలా రెండు సార్లు చేయాలి.
 • మసాజ్ తర్వాత వెంటనే లేదా 3 గంటల తర్వాత, వీలుంటే మరునాటి ఉదయమూ తలస్నానం చేయొచ్చు. ఇంట్లోనే స్వయంగా మసాజ్ తో సంతృప్తి చెందనివారు స్పా, సెలూన్ లను ఆశ్రయించవచ్చు.

ఉపయోగాలు

 • శరీరంలోని నాడుల కొనలు మాడులో ఉంటాయి. హెడ్ మసాజ్ వల్ల అవన్నీ చైతన్యవంతమవుతాయి.
 • క్రమబద్ధమైన మసాజ్ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
 • ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. శరీరానికి, మనసుకు సమన్వయం పెరుగుతుంది.
 • తల, నుదురు, కణతలు, మెడ, భుజ భాగాలకు రక్తసరఫరా పెరుగుతుంది.
 • తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం, సుఖనిద్ర, మెదడుకు పునరుత్తేజం కలుగుతాయి.
 • జుట్టు కుదుళ్ళు బలపడి, చర్మపు ముడతలు పోయి చక్కని అందం చేకూరుతుంది.
 • జీవక్రియల వేగం పెరిగి అనారోగ్యాలు దూరమవుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE