కొందరు విద్యార్థులు ఏడాది మొదటినుంచి ఏరోజు పాఠాలు ఆరోజు చదువుతారు. కానీ పరీక్షల్లో కష్టపడినంతగా రాణించలేరు. మరికొందరు అడపాదడపా చదివినట్లే కనిపిస్తారు గానీ చక్కని మార్కులు సాధిస్తుంటారు. చదవాల్సిన అంశం పట్ల స్పష్టత, సమగ్ర అవగాహన, చదివే విధానం వంటి అంశాల్లో ఉండే మార్పులే ఈ తేడాకు ప్రధాన కారణాలు. ఈ విషయంలో నిపుణులిచ్చే కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకొని, పాటించటం ద్వారా ఎవరైనా పరీక్షల్లో చక్కని ప్రతిభను చూపించవచ్చు.

ముఖ్యాంశాలు

  • పరీక్షలకు తగినంత సమయం కేటాయించటం, సిలబస్, అందుకు తగిన నోట్స్‌, చదివేటప్పుడు ఏదైనా అనుమానం వస్తే వివరించే మిత్రులు ఉన్నప్పుడు భయం, ఆందోళన లేకుండా సౌకర్యంగా చదువుకోవచ్చు. దీనివల్ల చదివింది బాగా గుర్తుంటుంది.
  • ఏరోజుకారోజు చదువుకోవటం ముగియగానే.. చివరలో ఇప్పటికే చదివి, బాగా పట్టు సాధించిన పాఠాలు, ఒకసారి చదివినవి, అసలు చదవనివేమిటో అంచనా వేసుకోవాలి. అప్పుడే సిలబస్ కంగారు తగ్గి ధైర్యంగా చదువుతారు.
  • కేవలం చదివి సరిపెట్టకుండా ఒక సారి రాసి చూసుకోవటం, ఆడియో పాఠాలు వినటం, స్నేహితులకు వివరించి వారి అభిప్రాయం కోరటం చేస్తే బాగా గుర్తుండిపోతుంది.
  • చదివేటప్పుడు పూర్తి ఏకాగ్రత పెట్టటం ఎంతైనా అవసరం. దీనివల్ల తక్కువ సమయంలో అర్థం చేసుకోవడం వీలవుతుంది. లేకుంటే చదివిందే 10 సార్లు చదవాల్సి వస్తుంది.
  • పరీక్షల సమయంలో రాత్రంతా మేలుకోరాదు. కనీసం 6 గంటలపాటు నిద్ర తప్పనిసరి. అప్పుడే జ్ఞాపకశక్తి బాగుంటుంది.
  • చదువుకునేటప్పుడు మొబైల్‌ ‘స్విచ్‌ ఆఫ్‌’ చేస్తేనే పూర్తిగా మనసు పెట్టటం సాధ్యపడుతుంది.
  • చదివేటప్పుడు ‘ఇంటర్‌నెట్‌’ నుంచి సమాచారం అవసరమైతే, దాన్ని ‘ప్రింట్‌’ తీసుకొని చదవడం మంచిది. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఏకాగ్రత కూడా దెబ్బతినదు.
  • తెల్లవారు జామున ఆహ్లాద వాతావరణంలో కూర్చొని చదువుకొంటే మరచిపోవటమనే సమస్య తక్కువ.
  • రోజూ షెడ్యూల్‌ ప్రకారం చదువుకోవాలి. ప్రతి 2 గంటలకోసారి 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని వేరే సబ్జెక్టు చదువుకొంటే అన్ని అంశాలూ చదవొచ్చు.
  • ప్రిపరేషన్ సమయంలో సినిమాలు, ఆటలు, పార్టీల జోలికి పోవద్దు.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE