నరకుడనే క్రూర రాక్షసుడిని కృష్ణుడు ఈ రోజున సంహరించినందుకు ఏటా ఆశ్వీయుజ అమావాస్య నాడు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. నిజానికి చెడు కేవలం రాక్షసుల రూపంలోనే ఉండాలని లేదు. నిరాశా నిస్పృహలు, వ్యాకులత, భయం వంటి లక్షణాలు మనం చూడని రాక్షసుల కంటే జీవితానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే ఈ దీపావళి పండుగ మన జీవితంలోని అన్ని ప్రతికూల విషయాలను సంహరించాలనే విషయాన్ని గుర్తుచేస్తుంది. 

పండుగ అనేది జీవితాన్ని ఉత్సాహమైన, ఆనందభరితమైన స్థితికి తీసుకువచ్చే ఒక సాధనం. ఇప్పుడంటే ఏడాదిలో 7 లేదా 8 పండుగలు జరుపుకొంటున్నాము గానీ ఒకప్పుడు భారతీయులకు ఏడాదిలోరోజూ పండుగే. పాతరోజుల్లో పండుగలను ఊరంతా కలిసి జరుపుకునేవారు. మళ్ళీ అలా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల మన జీవితాన్ని కూడా ఒక పండుగలా జీవించాలనే వాస్తవాన్ని అందరూ గుర్తించటమే గాక తాము చేస్తున్న పనుల్లో అందరూ లీనమై దాన్ని ఆనందిస్తూ చేస్తారు. ఒకరకంగా మనిషి జీవిత రహస్యం ఇదే. దీనివల్ల జీవితంలోని ప్రతిదాన్నీ మరీ ఎక్కువ సీరియస్ గా చూడకుండా దాన్ని ఆటగా భావించి నిమగ్నమయ్యే తత్త్వం అలవడుతుంది. దీపావళి మనకిచ్చే సందేశం కూడా ఇదే. చివరగా.. దీపావళి రోజున కాల్చే టపాసుల గురించి చెప్పుకోవాలి. మనసుకు ఉత్తేజాన్ని కలిగించటం ద్వారా మన ప్రాణ శక్తి, గుండె, మనస్సు, శరీరం ప్రతిరోజూ ఒక తారాజువ్వలా ఎగిసిపడాలనే సందేశాన్ని టపాకాయల నుంచి మనం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవితమంతా రోజూ దీపావళే.  

                                                                                                                         (ఈషా ఫౌండేషన్ సౌజన్యంతో)Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE