ఈ రోజు ప్రేమికుల దినోత్సవం. ప్రేమ మనిషి జీవితంలో విడదీయరాని భాగం. ప్రేమ హద్దులు, నిర్వచనాలకు అందని ఒక అతీత భావన. దానికి నిర్వచనాలు ఇవ్వటం ఎవరికైనా కష్టమే.ప్రేమంటే..రెండు మనసులతో బాటు ఇద్దరు ఒక బంధంలో ఇమిడిపోవటం. ప్రేమంటే ఎదుటివ్యక్తి లోని లోపాలనూ, బలహీనలనూ ప్రేమించగలగటం కూడా. 

ప్రేమ స్వచ్ఛతకు సంకేతం. స్వచ్ఛతకు, ప్రేమకు అవినాభావ సంబంధం ఉంది. ప్రేమ గొప్పదనాన్ని వివరించే ఈ జానపద గాథను బట్టి అదెంత గొప్పదో అర్థమవుతుంది. ఒకరోజు ఓ ఇంటికి ముగ్గురు దేవదూతలు వచ్చి తలుపు తట్టగా ఆ ఇంటికోడలు తలుపు తీసింది. దూతలు తమను ప్రేమ, ధనం, విజయం అని పరిచయం చేసుకొని తమలో ఎవరినైనా కోరుకోమని అన్నారు. ఆ అమ్మాయికి ఏమి చేయాలో పాలుపోక అత్తమామలను సంప్రదించగా మామ గారు ధనాన్ని, అత్తగారు విజయాన్ని కోరుకోమని సూచిస్తారు. ఆలోచించిన ఆ కోడలు చివరికి ప్రేమ అనే దూతను ఇంట్లోకి ఆహ్వానించగా అతనితో బాటే మేమూ అంటూ.. ప్రేమతోపాటు ధనం, విజయం ఇద్దరూ ఆ ఇంట్లోకిప్రవేశించారు. 

'ప్రేమికుల రోజు' గొప్పదనాన్ని, విస్తృతమైన దాని విలువను యువత గ్రహిస్తే ఈ రోజు మనం చూస్తున్న ఎన్నో అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఉండదు.ఈ సత్యాన్ని గ్రహించి ఆచరించేవారే నిజమైన ప్రేమికులు. 

ప్రేమలో ఉన్న యువతీయువకుల కలలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ 

వారందరికీ బీ పాజిటివ్ తరపునప్రేమికుల రోజు శుభాకాంక్షలు.....Recent Storiesbpositivetelugu

యాప్ సాయంతో పరీక్షల్లో రాణింపు 

 ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని 

MORE
bpositivetelugu

మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, 

MORE