ఫిబ్రవరి వచ్చేసింది. విద్యార్థులు  పరీక్షల కోసం రాత్రీ పగలూ చదువుకొనే సమయం. ఇన్నాళ్లుగా చదివిన  పాఠాలు, విషయాల్ని మననం చేసుకొంటూ నమూనా పరీక్షలు రాసే సందర్భం. ఈ సమయంలోనే సిలబస్ పూర్తిగా చదవలేదనో, చదివినా గుర్తుంటుందో లేదో అనే అనుమానాలూ విద్యార్థులను వేధిస్తుంటాయి. చూసేవారికి ఇది చిన్న విషయంగా అనిపించినా విద్యార్థులకు ఇది ఒత్తిడి కలిగించే అంశమే.  ఇలాంటి ఒత్తిళ్ల నుంచి విద్యార్థులను బయటపడేసి, ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఉపయోగపడే యాప్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడే ఆ యాప్స్ వివరాలను తెలుసుకుందాం. 

  • పరీక్షలకు సిద్ధమయ్యేవారు గత సంవత్సరాల్లో వచ్చిన ప్రశ్నలు, సరైన జవాబులను తెలుసుకొనే ప్రయత్నం చేయటం తెలిసిందే. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు వీటికోసం లెక్కకు మించిన గైడ్స్ కొనే బదులుగా పాత పరీక్ష పత్రాలను ఆప్‌ రూపంలో అందిస్తోంది విక్రమ్‌ సిరీస్.  INTERMEDIATE EXAM PREPARATION అనే ఈ యాప్ లో ఇంటర్ కు సంబంధించిన పలు గ్రూపుల తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ పేపర్లు ఒకేచోట ఇమేజ్‌ల రూపంలో పొందొచ్చు.
  • ఒత్తిడికి దూరంగా పరీక్షలకు మానసికంగానూ సిద్ధమయ్యేందుకు IMPACT INDIA వంటి యాప్స్ ఉపయోగపడతాయి. ఇందులో సమయపాలన, జ్ఞాపకశక్తి పెంచే మెళకువలు, ఒత్తిడిని అధిగమించే చిట్కాలు, నెగోషియేషన్‌ స్కిల్స్‌ లాంటి అంశాల వీడియోలు ఉంటాయి. ఈ యాప్‌ నుంచి అనుబంధ యూట్యూబ్‌ పేజీకి వెళ్లి ఆ వీడియోలు వీక్షించవచ్చు.
  • గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంగ్లిష్‌ పరీక్ష కాస్త కష్టంగా అనిపించటం సహజమే. ఇలాంటివారు English Grammar Test యాప్‌ సాయం తీసుకోవచ్చు. ఇందులో ఇంటర్మీడియట్‌, అప్పర్‌ ఇంటర్మీడియట్‌ అనే విభాగాల్లో గల 1200 ఇంగ్లిష్‌ గ్రామర్‌ అంశాలు దశల వారీగా సాధన చేస్తే ఇంగ్లిష్ పరీక్షను సులభంగా ఎదుర్కోవచ్చు.
  • మాథ్స్ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ విభాగాల్లో సబ్జెక్టు ఎంత ముఖ్యమో ఫార్ములాలూ అంతే ముఖ్యం. చాలా మంది వీటిని గుర్తుంచుకునే విషయంలో తడబడుతుంటారు. ఇలాంటి వారికోసం Formula Deck యాప్‌ ఉపయోగపడుతుంది. వ్యక్తిగత వివరాలతో యాప్ లో ఎకౌంటు తెరచి అందులో కోరిన విభాగంలో ఫార్ములాలు నేర్చుకోవచ్చు.
  • కొందరు ఎంత బాగా చదివినా పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లేసరికి కంగారు పడుతుంటారు. ఇలాంటివారు పరీక్షకు ముందు శ్రావ్యమైన సంగీతం వింటే మంచిది. దీని కోసం Calm లాంటి యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని హెడ్‌ఫోన్స్‌తో వింటే మనసు ప్రశాంతంగా ఉంది ఏకాగ్రతతో పరీక్ష రాయగలరు.
  • సిలబస్ అంత చదివి చివరలో రివిజన్ చేసుకోవాలన్నప్పుడు మొత్తం పుస్తకాలు తిరగేయటం తలనొప్పే. ఇలాంటప్పుడు మొబైల్‌ లో Telangana SCERT Books యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొంటే తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, హిందీ భాషల్లో 1-10 తరగతుల పుస్తకాల పీడీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి.
  • పుస్తకాలు చదవటం కంటే అవే అంశాలను వీడియో రూపంలో చూస్తే బాగా గుర్తుంటాయి. ఈ అవకాశం అందించే యాప్స్ లో Khan Academy ఒకటి. ఇందులో మ్యాథ్స్‌, సైన్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌,తదితర అంశాల సమాచారం ప్రాథమిక నుంచి డిగ్రీ స్థాయి వరకు వీడియోల రూపంలో లభిస్తుంది. అలాగే యూట్యూబ్‌ లో తెలుగు రాష్ట్రాల పదో తరగతి పాఠాలు వివరంగా తెలుసుకోవాలంటే Digital Teacher వంటివాటిని ఆశ్రయించొచ్చు.
  • పరీక్షలకు తయారయ్యే వారు సమయపాలన పాటించటం ఎంతైనా అవసరం. సమయం, సిలబస్ లను బట్టి సమయపాలన కోసం మొబైల్‌లో Exam Countdown యాప్ వేసుకొని పరీక్షల తేదీలు, సిలబస్ వివరాలు పొందుపరిస్తే కౌంట్‌డౌన్‌ రూపంలో ఎప్పటికప్పుడు మిగిలిన సమయం తెలుస్తుంది. దీంతో హడావుడి, గాబరా లేకుండా తగినట్లు చదువుకోవచ్చు.
  • పరీక్షలకు ముందు నుంచే నిఘంటు యాప్స్ వాడితే కొత్త పదాల స్పెల్లింగ్స్ తప్పు రాయకుండా చూసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE