అంది వచ్చిన సాంకేతికత మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతోంది. మహిళలపై జరుగుతున్న దాడుల కేసుల్లోనూ ఈ సాంకేతికతేకీలక సాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యంగా...షిఫ్ట్ ల వారీగా పనిచేసే ఎందరో మహిళలకు పలు ఆధునిక యాప్స్ బాడీగార్డులుగా సేవలందిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి కొన్ని యాప్స్ గురించి తెలుసుకొందాం.

  • మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన రాకుండా చేయగల యాప్.. హ్యాక్‌ ఐ’. తెలంగాణ పోలీసులు అభివృద్ధి చేసినఈ యాప్‌ను ఫోన్లో డౌన్‌లోడ్‌ చేసుకుని..క్యాబ్‌లో కూర్చోగానే క్యాబ్‌ నంబరు, డ్రైవర్‌ ఫోటో విమెన్‌ ట్రావెల్‌ మేడ్‌ ఈజీ’ అన్న ఐకాన్‌ దగ్గర పోస్ట్‌ చేస్తే పోలీసులు ఆ క్యాబ్‌పై నిఘా ఉంచుతారు.
  • తెలంగాణ రాష్ట్ర పోలీసులు మహిళా రక్షణ కోసం తెచ్చిన సేవ ఇది. కొత్త ప్రదేశాల్లో, రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించేవిద్యార్థినులు,మహిళలు భద్రతకోసం తాము ప్రయాణిస్తున్న క్యాబ్లేదా ఆటో నంబరును 9969777888 కు SMS చేస్తే దానికి సమాధానంగా ఒకSMS వస్తుంది. అంటే వారు ప్రయాణిస్తున్న వాహనం GPRS కు అనుసంధానం అయినట్లే. దీనివల్ల వారు నిర్భయంగా గమ్యం చేరగలుగుతారు.
  • విద్యార్థినులు, మహిళలు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు, కిడ్నాప్‌ అయినప్పుడు తామున్న చోటును తెలియజేసే మరో యాప్.. పేరెంట్‌ పెండింగ్‌ గ్లింప్స్‌ వాచ్‌. ముందుగా ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రి, ఐవోఎస్‌, విండోస్‌ 7 అపరేటింగ్‌ సిస్టమ్‌ వాడేవారు ఫ్రీగా డౌన్‌లోడ్‌ చేసుకొని కోవచ్చు.జీపీఎస్‌ ఉన్న ఫోనుకు లొకేషన్‌ ను అనుసంధానం చేయాలి. దీంతో మీరెక్కడున్నారో కుటుంబ సభ్యులకు తెలుస్తుంది.
  • మహిళలకు రక్షణగా నిలిచే మరో యాప్‌ ‘మై సెక్యూరిటీ’. సమాచారంతో పాటు.. పరిసరాల ఫొటోలను కూడా సన్నిహితులకు పంపించగలిగే టెక్నాలజీ ఇందులో ఉంది.
  • మీ క్షేమ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియచేసే ఉచిత ఆండ్రాయిడ్‌ యాప్‌... ఐయామ్‌ సేఫ్‌’ అప్లికేషన్‌.ఏ ప్రాంతంలో ఉన్నారనే సమాచారంతో బాటు మ్యాప్స్ కూడా పంపుతుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకొంటే 3 సార్లు మెనూ బటన్‌ నొక్కితే నేరుగా ప్రమాద సమాచారం ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఎంపిక చేసిన వారికి వెళ్ళిపోతుంది.
  • దాడికి దిగిన వారిని వణికించేలా చేసే యాప్.. ‘షేక్‌ అలర్ట్‌’. ఈ ఐ ఫోన్‌ అప్లికేషన్‌ ఉన్నవారిపై ఎవరైనా దాడి చేసినా..కిడ్నాప్‌ యత్నం చేసినా.. చేతిలో ఉన్న ఫోన్‌ను గట్టిగా షేక్‌ చేస్తే చాలు..చెవులు చిల్లులు పడే శబ్దం వస్తుంది. ముందుగా నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్లకు లొకేషన్‌ వివరాలు చేరిపోతాయి. ఈ అప్లికేషన్‌ను ఆపిల్‌ స్టోర్స్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • మహిళల రక్షణకు ఉద్దేశించిన మరో మ్యాప్ బేస్‌డ్ మొబైల్ అప్లికేషన్... సేఫ్టీపిన్’. ఈ ఆప్‌లో ఏది పోస్ట్ చేసినా అది ఆ గ్రూప్ సభ్యుల వాల్ ట్యాగ్ మీద కనపడుతుంది. రోడ్డు స్థితి, ఏదైనా ఇబ్బందులున్నాయా, వీధి దీపాలున్నాయా? వంటి వివరాలు, రోడ్డు మీద ఎవరైనా దాడులకు దిగుతున్నా ఆ గ్రూపులోని అందరికీ సమాచారం అందుతుంది. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ లో లభిస్తుంది.

కొన్ని సూచనలు

  • ఫోన్‌లో యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని వాటిని యాక్టివేట్‌ చేయాలి. జీపీఆర్‌ఎస్‌ ఆన్‌ చేసి ఉంచాలి.
  • మీ క్షేమం కోరే వారి నంబర్లతో పాటు..కొన్ని మెసేజ్‌లను కూడా ముందే టైప్‌ చేసి ఉంచుకోవాలి.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE