మనం పూజా సమయంలో ధ్యానం చేస్తుంటాం. మనిషికి తన వాస్తవస్థితికి ఎరుకపరచటమే ధ్యానం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సమయంలో సాధకుడు మనసును నిశ్చలంగా నిలిపి మౌనంగా, పూర్తి ప్రశాంతతలో మునిగిపోగలిగితే తన సహజస్టితిని తెలుసుకోగలడు. అప్పుడే అసలైన జ్ణాన మార్గాన అతని ప్రయాణం ఆరంభించగలుగుతాడు. ఈ స్థితికి చేరటానికి సాధకుడు ధ్యానానికి సంబంధించిన సంపూర్ణ అవగాహన కలిగివుండటంతో బాటు నిరంతర సాధనా చేయాల్సి ఉంటుంది. 

 ధ్యానం అంటే మనస్సుకు అతీతమైన స్థితి. అసలైన ధ్యానానికి ముందు మనస్సులోని ఆలోచనలను వదిలించుకోవాలి. అయితే.. మనసును కట్టడి చేయటం కష్టమే. అందుకే సాధకుడు ఒక ప్రేక్షకునిలా లేదా సాక్షిగా మారి తనలోని ఆలోచనలను, పరిసరాలను, ప్రతి కదలికను లోపలి నుంచే గమనించాలి. అయినా.. ఆలోచనలు, పరిసరాలు ధ్యానాన్ని భంగ పరుస్తూనే వుంటాయి. ఈ ఆలోచనలను అదిమిపెట్టడానికి ప్రయత్నం చేయటం, ఆయా పరిసరాల నుండి పారిపోవటం చేయరాదు. అలాచేస్తే ఈ ప్రయత్నాలు మానసిక ఘర్షణకు దారితీస్తాయి. వచ్చే ఆలోచనలను, పరిసరాలను సాధకుడు స్వీకరిస్తూనే, వాటికి ఏ విలువా ఇవ్వకుండా ఉపేక్షిస్తూ పోవాలి. ఇలా అలల్లా వచ్చే ఈ ఆలోచనలను సాధకుడు పట్టించుకోవటం మానేస్తాడో.. అప్పుడు అవన్నీ నశిస్తాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఆచరించాలి. ఇలా.. నిరంతర సాధనతో కొంతకాలానికి సాధకుడు నెమ్మదిగా ఏ ఆలోచనాలేని స్థితికి దగ్గరవుతాడు. అంతిమంగా అతని సకల ఆలోచనలు పూర్తిగా లుప్తమై మనోతీత స్థితిని అనుభూతి చెందుతాడు. ఈ స్థితి సాధకుడిని గతకాలపు ఆలోచలననుండి, రాబోయే కష్టాల, బాధ్యతల నుంచి విముక్తుణ్ణి చేసి సదా వర్తమానంలో నిలిపేలా చేస్తుంది. ఇదే అసలైన జ్ణాన స్థితి. సాధకుడికి ఉన్న అపోహలన్నీ పటాపంచలై అసలైన ఆనందంలో తెలియాడేలా చేస్తుంది. దీనినే అవధూత స్థితి లేదా శ్రీకృష్ణ స్థితి అనీ అంటారు. అప్పుడు ధ్యానమే జీవితం గా మారుతుంది. ఆ తర్వాత సాధకుడి జీవితం తామరాకు మీద నీటి బిందువులా మారిపోతుంది. ఇదే బుద్దుని స్థితి.  

 చాలామంది అపోహ పడుతున్నట్లుగా ధ్యానానికి కష్టమైన నియమాలు పాటించాల్సిన పనిలేదు. అలాగే గంటల తరబడి కూర్చోనవసరం గానీ, ఏవో ఏకాంత ప్రదేశాలకూ పోవాల్సిన పనిలేదు. రోజువారీ భాద్యతలను నిర్వర్తిస్తూనే కొంత ఏకాగ్రతతో ఉంటే చాలు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE