• HOME
  • అందం
  • బ్లాక్‌హెడ్స్‌ బెడద వదిలేదెలా?

అందం విషయంలో చర్మానిది ప్రధాన పాత్ర. అయితే  కొందరిలో చక్కని  కనుముక్కు తీరు ఉన్నా చర్మం మీది మచ్చలు, మెుటిమల కారణంగా వారి అందం మసకబారుతుంది . వీటికి తోడు బ్లాక్‌హెడ్స్‌ తోడైతే మొటిమలకు దారితీసి ముఖం నల్లగా మారుతుంది. ఈ వేసవిలో బ్లాక్‌హెడ్స్‌ బెడద మరింత ఎక్కువ గనక వాటిని  వదిలించుకొనే కొన్ని చిట్కాలు... 

  • తరచూ నిమ్మరసం, బాదం నూనె, గ్లిసరిన్‌ను సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించుకుంటే బ్లాక్‌హెడ్స్‌ తగ్గటమే గాక ఇతర మచ్చలూ తొలగిపోతాయి.
  • రోజూ  గోరువెచ్చటి నీళ్ళలో టవల్‌ లేదా నాప్కిన్‌ను ముంచి దానిని పావుగంట పాటు ముఖం మీద ఉంచుకోవడం ద్వారా చర్మ రంధ్రాలలో చిక్కుకుపోయిన మురికి, మృతకణాలు వంటివి బయటకు వచ్చేస్తాయి. ఆ నాప్కిన్‌ను వేడి నీటిలో ఉటికీ ఆరేసి మళ్ళీ వాడుకోవచ్చు. 
  • బ్లాక్‌హెడ్స్‌ ఉన్నచోట గోరువెచ్చని తేనె రాసి 10 నిమిషాల తర్వాత కడిగితే సమస్య తగ్గుముఖం పడుతుంది.
  • ఎప్పటికప్పుడు చర్మం మీది మృత కణాలను తొలగిస్తే బ్లాక్‌హెడ్స్‌ సమస్య చాలా వరకూ తీరిపోతుంది.
  • మరీ జిద్దుగారే చర్మ స్వభావం ఉన్నవారు మట్టితో వేసే క్లే మాస్క్‌ ప్రయత్నించాలి.
  • రోజూ మేకప్ వేసుకునే వారు మరీ ఎక్కువగా ఉండే కాస్మోటిక్స్ వాడటం వల్ల ఆయా కాస్మోటిక్స్ అవశేషాలు ముఖచర్మంలో ఉండే రంద్రాలలో చేరి మొటిమలకు కారణమవుతాయి. అందుకే వీరు తమ చర్మ స్వభావానికి అనుకూలమైన సౌందర్య సాధనాలను ఎంపిక చేసుకోవాలి.
  • జిడ్డు చర్మం ఉన్నవారిలో వేసవి ఉక్కపోత కారణంగా ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దీనికి తోడూ చెమట అదనం. ఇలాంటి వారు సబ్బుకు బదులుగా ఏదైనా క్లెన్సర్‌తో శుభ్రం చేసుకుని నీళ్ళతో కడిగేసుకుంటే ముఖం శుభ్రంగా ఉంటుంది. సబ్బు ఎక్కువగా వాడటం వల్ల ముఖ వర్చస్సుకు కారణమయ్యే తైలాలు పోవటమే గాక చర్మ కణాలు పాడయ్యే ప్రమాదం ఉంది. Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE