• HOME
  • అందం
  • పట్టులాంటి చర్మానికి 5 మార్గాలు

ఈ ఎండాకాలంలో రోజుకోరకంగా మారే  వాతావరణానికి చర్మం చెప్పలేనంత ఒత్తిడికి గురవుతుంది. ఈ రోజుల్లో ధరించే నూలు దుస్తులు, గొడుగుల వంటివి కూడా కొంత మేరకే కాలుష్యం, భానుడి ప్రతాపాన్ని నియంత్రిస్తాయి తప్ప పూర్తిగా కాదు. రోజూ స్నానం చేయటం, ముఖం కడుక్కోవటం ద్వారా అక్కడ చేరిన వ్యర్ధాలు, మురికి తొలగిపోయినా ఎంతోకొంత లోలోపలి పొరల్లో మిగిలి మచ్చల రూపంలో  ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటి విధానాలను  ఆశ్రయించటం అవసరం.

ఆయిల్ క్లీనింగ్

వంటకు వాడే ఆముదం, ఆలివ్, కొబ్బరినూనె తదితర నూనెలతో రోజూ ముఖాన్ని మర్దనా చేస్తే చక్కని ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఎండ ధాటికి పొడిబారిన, ముడుతలుపడి వేళ్ళాడుడుతున్నట్లు కనిపించే చర్మానికి క్లీనింగ్ మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.

చేసే పద్దతి: ముందుగా గోరువెచ్చని నూనెను కొద్దికొద్దిగా ముఖమంతా పట్టించి 10 నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి. దీంతో చర్మపు సూక్ష్మ రంధ్రాలలో దాగిన మురికి, వ్యర్ధాలు గోరువెచ్చని నూనెలో కరిగి కొంచంకొంచంగా బయటికి వస్తాయి. ఇలా చేయటం వల్ల  ముఖ కండరాల కదలికలు కూడా మెరుగుపడి అక్కడి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మర్దన పూర్తైన తర్వాత వేడినీటిలో ముంచి పిండిన మెత్తని వస్త్రాన్ని 5 నిమిషాలపాటు ముఖాన కప్పి, ఆ తర్వాత తీసి మరోమారు ముఖమంతా బాగా తుడిస్తే ఇంకా మిగిలిపోయిన ముఖ చర్మపు వ్యర్ధాలు ఉంటే  పూర్తిగా తొలగిపోతాయి.

జాగ్రత్త: జిడ్డు చర్మం ఉన్నవారికి క్లీనింగ్ విధానం అసలు పనికిరాదు.

స్క్రబ్బింగ్ అండ్ వాషింగ్

రెండు మూడు నిమిషాల్లో ముఖాన్ని శుభ్రపరచుకోదగిన పద్దతి ఇది. రోజూ వాడే పేస్ వాష్ కి  కందిపప్పు నూక, పెసర నూక, చక్కెర వంటివి కలిపి దానికి తగినంత మయిస్చ్యరైజర్ జోడించాలి. ఈ మిశ్రమాన్ని కొంచం కొంచెంగా తీసుకొని 5 నిమిషాలపాటు ముఖమంతా బాగా మర్ధన  చేసుకొని ఆరనిచ్చి చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ 2 లేదా 3 సార్లు చేస్తే చక్కని ఫలితాలు కనిపిస్తాయి.

శనగపిండి, పసుపు మిశ్రమం

రెండు చెంచాల శనగపిండిలో రెండు చిటికెల పసుపు వేసి దానికి రోజ్ వాటర్, పాలు, కలబంద గుజ్జు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 10 నిమిషాలపాటు ఆరనిచ్చి మరో 5 నిమిషాల పాటు బయటివైపుకు బాగా మర్దనా చేసి ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల చర్మానికి మంచి కాంతితో బాటు ముఖ చర్మం మీద చేరిన పలు రకాల బ్యాక్టీరియాలు దూరమవుతాయి.

 



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE