మహిళల అలంకరణ ప్రాధాన్యాల్లో గోరింటాకుది ప్రత్యేకమైన స్థానం. అట్లతద్ది వంటి పండుగలకు గోరింటాకు పెట్టుకోవటం తెలుగు నేల ఆనవాయితీ. చిన్నశుభకార్యం మొదలు పండగలూ, పెళ్ళిళ్ళ వరకు మహిళలు గోరింటాకు పెట్టుకోవటానికి ఆసక్తి చూపుతారు. గోరింటాకుతో పండిన చేతులు, పాదాల అందాన్ని ఏ నగల, దుస్తులతో పోల్చలేమంటే అతిశయోక్తి కాదు.  గోరింటాకు బాగా పండితే మంచి భర్త వస్తాడని తెలుగు నాట వాడుకలో ఉన్న మాట. గోరింటాకు వినియోగంలో పాటించాల్సిన  కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు  తెలుసుకుందాం.

  • అవకాశం ఉన్నవారు చెట్టునుంచి సేకరించిన తాజా గోరింటాకును రుబ్బి వాడటం మంచిది.
  • లేని పక్షంలో మార్కెట్లో లభించే మంచి నాణ్యమైన గోరింటాకును ఎంపిక చేసుకోవాలి. చౌకబారు బ్రాండ్ల మాయలో పడితే చర్మ సమస్యలు తప్పవని గుర్తించాలి.
  • సహజంగా ఎండిన గోరింటాకు లేత ఎరుపు లేక ఎరుపు కలిసిన ఖాకీ రంగులో ఉంటుంది. అయితే తాజాగా కనిపించేందుకు కొందరు వ్యాపారులు ఆకుపచ్చ రంగు కలుపుతారు గనుక ఆకుపచ్చ రంగు హెన్నా పొడిని వాడొద్దు.
  • హెన్నా కొనేటప్పుడు కాస్త హెన్నా పొడిని అరచేతిలోకి తీసుకుని వేలితో  దానిపై రుద్దితే  ఎంత వేడి పుడితే అంత నాణ్యమైనదని అర్థం. 
  • హెన్నా మిశ్రమానికి ఆవనూనె కలిపి గిన్నెలో పెట్టి దానిపై పొడి గుడ్డ కప్పి 10 గంటల పాటు పొడి వాతావరణంలో ఉంచి వాడితే బాగా పండుతుంది.
  • చేతులు, కాళ్ళపై అవాంచిత రోమాలున్న వారు వాక్సింగ్ చేయించుకొని, ఆ తర్వాత గోరింటాకు పెట్టుకుంటే మంచిది. హెన్నా పెట్టుకున్న తర్వాత వాక్సింగ్ చేయిస్తే రంగు పోతుందని మరువొద్దు.
  • గోరింటాకు పండిన తర్వాత నేరుగా నీళ్ళు పోసి కడగ కూడదు. ఎండిన హెన్నాను చెంచా లేదా చాకుతో నెమ్మదిగా తొలగించి అరచేతులపై కొంచెం సున్నం (తాంబులంలో వాడేది) వేసి రెండు అరచేతులూ బాగా రుద్ది నీటితో కడగాలి. ఎలర్జీలు బాధితులు సున్నా నికి బదులు కొబ్బరి నూనె తో రుద్దుకొని నీళ్ళతో కడిగితే రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది.
  • గోరింటాకు మిశ్రమానికి పుదీనా గుజ్జు లేక పుదీనా నూనె కలిపితే మరింత పండుతుంది.
  • హెన్నా పొడికి నిమ్మరసం కలిపి పెట్టుకుంటే పండిన రంగు ఎక్కువ కాలం నిలుస్తుంది.
  • గోరింటాకు పెట్టుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ సమయం ఉంచుకుంటే సహజంగా ఎండి బాగా పండుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE