• HOME
  • అందం
  • నల్లబడ్డ చర్మం మెరవాలంటే ..

మిగిలిన భాగాలతో పోల్చినప్పుడు మోకాళ్ళు, మోచేతుల వద్ద చర్మం మందంగా, నల్లగా ఉంటుంది. ఈ కింది చిట్కాలను పాటిస్తే మోకాళ్ళ, మోచేతుల వద్ద నల్లగా మారిన చర్మం సైతం పలుచబడి, నునుపుగా మారుతుంది. అవి..

  • చెంచాడు కొబ్బరి నూనె, అర చెంచాడు నిమ్మరసం కలిపి మోకాళ్ళు, మోచేతుల వద్ద రుద్ది, వేడి నీళ్లలో ముంచిన టవల్‌తో వారానికోసారి తుడిస్తే సమస్య తొలగిపోతుంది.
  • మోచేతులూ, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా, మందంగా మారితే రోజూ నిమ్మ చెక్కతో ఆ బాగాల వద్ద రుద్ది పావుగంట సేపు ఆగి వేడినీళ్లలో ముంచిన టవల్‌తో శుభ్రంగా తుడవాలి. ఇలా నెల రోజూలు చేసి, తర్వాత నెల నుంచి  వారానికి రెండుసార్లు చొప్పున చేస్తే మిగతా చర్మం మాదిరి మారుతుంది.
  • వాల్‌నట్‌ పొడి, కొబ్బరి నూనె కలిపి తరచూ రాస్తే కూడా నల్లబడ్డ చర్మం సున్నితంగా మారుతుంది.
  • మీగడకి, పసుపు కలిపి స్క్రబ్‌లా రోజూ రాసుకుంటే చర్మము నలుపు తగ్గి నున్నగా మారుతుంది.
  • రెండు చెంచాల పెరుగుకి కొంచెం బాదం పొడిని కలిపి రాసుకున్నా చర్మము నలుపు తగ్గి నునుపు అగును .
  • రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఆలివ్‌ ఆయిల్‌ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుంటే చర్మం ముడతలు పడదు.
  • మూడు చెంచాల బొరాక్స్‌ పొడికి, రెండు చెంచాల గ్లిజరిన్‌, రెండు చెంచాల రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మోకాలికీ, మోచేతులకీ రాసుకుని పావుగంట ఆగి, వేడి నీళ్లతో కడిగేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నలుపు తగ్గి చర్మం నునుపు తేలుతుంది.
  • గుడ్డులోని తెల్లసొనకు చెంచాడు పంచదార, అరచెంచా జొన్నపిండి కలిపి దానిని గరుకుగా ఉన్న చోట రాసుకుని, ఆరాక శుభ్రపరుచుకున్నా మంచి ఫలితం ఉంటుంది.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE