• HOME
 • అందం
 • పెదవుల ఆరోగ్యం.. జాగ్రత్తలు

అందమైన పెదాలను దొండ పండుతోనో లేక లేత గులాబీ రేకలతోనూ వర్ణిస్తుంటారు. ముఖపు ప్రతి హావ భావంలో, మెరిసే ప్రతి చిరు నవ్వులో పెదవుల పాత్ర కీలకం. మానవ శరీరంలో తైల గ్రంథులు లేని భాగం పెదవులే. పెదవులు అందంతో బాటు ఆరోగ్యాన్నీ సూచిస్తాయి. అయితే వాతావరణ కాలుష్యం, సూర్య కాంతి, చలి, హార్మోన్ల అసమతుల్యత, పొగ తాగటం వంటి కారణాల వల్ల పెదవులు నల్లగా, బిరుసుగా మారుతుంటాయి. అందుకే అందరూ పెదవుల ఆరోగ్యం మీద తగినంత ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. పెదవుల సమగ్ర ఆరోగ్యానికి దోహదపడే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

 • 2 చెంచాల చొప్పున పాలు, మీగడ తీసుకొని రంగరించి ఫ్రిజ్ లో చల్లబరచి రెండుపూటలా వేలితో తీసుకొని పెదాల మీద మర్దన చేసి ఆరిన తర్వాత దూదితో తుడుచుకుంటే పెదవులు సున్నితంగా మారతాయి.
 • గరిటెడు చిక్కని పాలలో గుప్పెడు తాజా గులాబిరేకలు కలిపి వేలితో బాగా కలిపి ఫ్రిజ్ లో ఉంచి అరగంట తర్వాత తీసి మరోమారు గులాబీ రేకలను పాలలో కలిసేలా మెదిపి, చెంచాడు బాదం గింజల పొడి కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదవుల మీద పల్చని పొరగా వేసి పావుగంట తర్వాత పొడి దూదితో తుడుచుకుంటే పెదవులు ప్రకాశవంతంగా మారతాయి.
 • దానిమ్మ రసం లేదా బీట్ రూట్ గుజ్జును అంతే మొత్తంలో మీగడతో కలిపి పెదవులకు రాసుకొంటే పెదాలు మెత్తబడతాయి.
 • తేనె, నిమ్మ రసం అరచెంచా చొప్పున కలిపి పెదాలకు రాసుకొని ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే కళతప్పిన పెదాలకు నూతన జవసత్వాలు చేకూరతాయి.
 • 3 పుదీనా ఆకులు నలిపి అందులో 5 చుక్కల రోజ్ వాటర్ కలిపి రాసుకుంటే మీ పెదవులు కొత్త రూపును సంతరించుకుంటాయి.
 • చక్కెర, వెన్న మిశ్రమంతో రోజూ పెదవులను రుద్దుకుంటే అక్కడి మృతకణాలు తొలగిపోతాయి.
 • పసుపు, పాలు కలిపి మెత్తటి బ్రష్ తో మసాజ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగి మెత్తని టవల్ తో తుడుచుకొని లిప్ బామ్ రాయాలి.
 • రోజూ కొత్తిమీర గుజ్జు పెదాలకు రాసుకొని ఆరిన తర్వాత నీటితో కడుక్కొంటే గులాబీ రంగు పెదాలు సొంతమైనట్లే.
 • పచ్చిబంగాళ దుంప ముక్కతో పెదాల్ని రుద్దితే నల్లగా మారిన పెదాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.
 • వీలున్నప్పుడల్లా లేత కీరదోస ముక్కల్ని పెదవులకు రాసుకుంటే పెదాలు మెరుస్తాయి.
 • నల్లబారిన పెదాల మీద తాజా నారింజ తొక్కతో తేలికగా రుద్దితే నలుపు రంగు మాయమవుతుంది.
 • ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ రాసుకుంటే పెదాలు మెరుస్తాయి.
 • చెంచా చొప్పున టమోటా గుజ్జు, మీగడ రంగరించి పెదవులకు రాసుకుంటే పెదవులు సహజమైన రంగును పొందుతాయి.

ఇతర జాగ్రత్తలు

 • చౌకబారు లిప్ స్టిక్స్, క్రీములు వాడొద్దు.
 • ధూమపానానికి దూరంగా ఉండాలి.
 • పదే పదే పెదవులను నాలికతో తడుపుకొని అలవాటు మానుకోవాలి.
 • ఎక్కువ క్లోరినేషన్ చేసిన నీటిని వాడొద్దు.
 • శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి.
 • కాఫీ, టీ వినియోగం తగ్గించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE