• HOME
  • అందం
  • కనుబొమ్మలు మెరవాలంటే..

కంటి అందం కనుబొమ్మల తీరు మీదే ఆధారపడి ఉంటుంది. చూడ చక్కని ఆకారంలో, ఒత్తైన కనుబొమ్మలున్న వారు పదిమందిలో ఉన్నా వారికుండే గుర్తింపు ఏంటో ప్రత్యేకం. వయసు, అనారోగ్యం, పోషకాహార లోపం వంటి సమస్యల కారణంగా కనుబొమ్మల అందం దెబ్బతినటం సహజమే. అయితే  కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా కనుబొమ్మల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అవి..

 పొడిబారిన, చిట్లినట్లు మారిన కనుబొమ్మ వెంట్రుకలకు రోజూ 2 సార్లు వ్యాజ్ లైన్ రాస్తే కనుబొమ్మలు తగినంత తేమను, మెరుపును సంతరించుకొంటాయి.

  • కనుబొమ్మల వెంట్రుకలు పల్చగా, బలహీనంగా ఉన్నవారు రోజూ నాలుగైదు చుక్కల ఆముదాన్ని కనుబొమ్మల మీద రాసి తేలికగా మర్దనా చేస్తే కుద్దుళ్ళు బలపడి ఒత్తుగా పెరుగుతాయి.
  • కనుబొమ్మలు వేగంగా, పొడవుగా పెరగాలంటే రోజూ నాలుగు చుక్కల ఆలివ్ నూనె లేక కొబ్బరి నూనె రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • పలు కారణాల వాళ్ళ కనుబొమ్మల ఎదుగుదల ఆగిపోయిన వారు రోజూ ఉల్లిగడ్డ రసం రాస్తే అందులోని భాస్వరం కనుబొమ్మల కుదుళ్ళ వద్ద రక్త ప్రసరణను పెంచి పెరుగుదలకు ఊతమిస్తుంది.
  • కనుబొమ్మలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఆరు లీటర్ల నీరు తాగాలి.
  • కనుబొమ్మలపై రోజూ తాజా కలబంద గుజ్జు రాయటం వల్ల ఎదుగుదల మెరుగుపడుతుంది.
  • కనుబొమ్మల మీద నిమ్మ తొక్కతో రుద్దితే అక్కడి చేరిన మలినాలు తొలగిపోయి ఆరోగ్యంగా కనిపిస్తాయి.
  • గుడ్డు పచ్చసొనను కనుబొమ్మలకు రాసి పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే కనుబొమ్మ వెంట్రుకల మూలాలు చక్కగా పెరుగుతాయి.



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE