• HOME
  • అందం
  • ఈ చిట్కాలతో చుండ్రు దూరం

వానాకాలంలో తరచూ తడవటం, చల్లని వాతావరణంలో తిరగాల్సి రావటంతో ఈ సీజన్లో చుండ్రు సమస్య సహజమే. చుండ్రు కారణంగా దురద, చీకాకుతో బాటు జుట్టు రాలటం వంటి ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకు షాంపూల వంటి ప్రత్యామ్నాయాల కంటే గృహవైద్యమే మంచిది. చుండ్రు నివారణకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీ కోసం..  

  • పావులీటరు కొబ్బరి నూనెలో గుప్పెడుమందార పువ్వులేసి మరగబెట్టి చల్లార్చి తలకు రాసుకుంటే జుట్టు రాలటం ఆగుతుంది. చుండ్రు సమస్య కూడా దరిజేరదు.
  • అరకప్పు చొప్పున వేపాకు రసం, పెరుగు కలిపి అందులో చెంచా నిమ్మరసం వేసి తలకు పట్టించి గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది.
  • గుప్పెడు మెంతుల పొడి, చెంచా నిమ్మరసం, 2 చెంచాల పెరుగు కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయం తలకు పట్టించి గంటపాటు ఆరనిచ్చి తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • తాజా కలబంద గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
  • గోరింటాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు, జుట్టు కుదుళ్లను బలపరచేందుకు, చుండ్రు, జుట్టు రాలటాన్ని ఆపేందుకు మంచి మందు .
  • కుంకుడుగాయలు కొట్టి వేడినీళ్లలో వేసి, గుప్పెడు పచ్చి మందారం ఆకుల్ని కలిపి తల స్నానం చేస్తుంటే చుండ్రు వదిలి పోవటమే గాక తెల్ల వెంట్రుకల సమస్యా తగ్గుముఖం పడుతుంది.
  • అరలీటరు నీటిలో 20 ముద్ద మందార పువ్వులు వేసి 100 మిల్లీలీటర్లకు మరగనిచ్చి, ఆరిన తర్వాత వడపోసి, వారంపాటు రోజుకు చెంచా చొప్పున పేనుకొరికిన దగ్గర మర్దన చేసి తలస్నానం చేస్తే కొత్త వెంట్రుకలు వస్తాయి. Recent Storiesbpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE