ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతగా ఉపయోగపడుతుందో సౌందర్య పోషణలోనూ అంతే  పనికొస్తుంది. చర్మ, కేశ సౌందర్యానికి గుడ్డు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

చర్మ సౌందర్యానికి

  • గుడ్డులోని 'లూటిన్' అనే పదార్ధం చర్మపు సాగే గుణాన్ని రెట్టింపు చేయటంతో బాటు చర్మంలో తగినంత తేమ నిలిచేలా చేస్తుంది. అందుకే తరచూ గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే మృత కణాలు తొలగి వదులుగా ఉన్న చర్మం గట్టిపడటమే గాక మొటిమలు కూడా తగ్గుతాయి. కంటికింది వలయాలు, ఉబ్బినట్లు కనిపించటమూ ఉండదు.
  • జిడ్డు చర్మం గలవారు గుడ్డుతెల్లసొన, చెంచా కొబ్బరి నూనె కలిపి రంగరించి వారానికి 3 సార్లు ముఖం, మెడ భాగాలకు బాగా పట్టించి  గోరు వెచ్చని నీటితో కడిగేస్తే క్రమంగా జిడ్డు తొలగి పోవటమే గాక  కాంతివంతం అవుతుంది.
  • మీది పొడి చర్మం అయితే గుడ్డులోని పచ్చసొనలో అరచెంచా నిమ్మరసం, చెంచా తాజా ఆలివ్ ఆయిల్ కలిపి రంగరించి ఆ  మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే పొడిచర్మం తగినంత తేమను పొంది మృదువుగా మారుతుంది.
  • ముఖం మీద మొటిమల మచ్చలు, ఎండకు కమిలిన చర్మం ఉంటే గుడ్డు సొనలో చెంచా తేనె, అరచెంచా ఆలివ్ ఆయిల్, 2 చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేస్తే ముఖ చర్మం మృదువుగా, కాంతి వంతమవుతుంది. ఇలా రోజూ చేస్తే మచ్చలూ మాయమవుతాయి.
  • ఎండ, కాలుష్యం కారణంగా దెబ్బ తిన్న చర్మానికి గుడ్డు పచ్చ సొనలో చెంచా చొప్పున తేనె,పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా  పట్టించి అరగంట తర్వాత చన్నీటితో శుభ్ర పరచుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. 

పట్టులాంటి కురుల కోసం

  • గుడ్డుసొనలో చెంచా చొప్పున పెరుగు, తాజా ఆలివ్ ఆయిల్, బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ మొదలు చివరల వరకూ బాగా పట్టించి గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టుకు బలం, కాంతీ చేకూరతాయి.
  • జుట్టు చివర్లు చిట్లినా, జుట్టు ఎదుగుదల తక్కువగా ఉన్నవారు గుడ్డు సొనలో చెంచా నిమ్మరసం కలిపి రంగరించి జుట్టుకు పట్టించి గంట తర్వాత మంచి షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు పెరగడమే కాకుండా, కోమలంగా మారుతుంది.
  • పొడి లేదా ఎండకు నిర్జీవంగా మారిన జుట్టుకు గుడ్డులోని తెల్ల సొన పట్టించి ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • దుమ్ము, ధూళికి గురైన జుట్టు పూర్వ స్థితికి రావాలంటే కప్పు వెన్నతీసిన పాలలో గుడ్డుసొన కలిపి గంట తర్వాత షాంపూతో స్నానం చేస్తే జుట్టుకి మంచి మెరుపు లభిస్తుంది.

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE