అన్ని కాలాల్లో లభించటమే గాక చౌకగానూ లభించే పండు అరటి.ఆకట్టుకొనే రంగు , కమ్మని రుచితో పాటు సులభముగా జీర్ణమయ్యే అరటి అన్ని వయసుల వారికీ ఇష్టమైన ఆహారం. ఆరోగ్యానికి ఎన్నో విధాలా పనికొచ్చే అరటి పండు అందానికి చేసే మేలు గురించి తెలుసుకొందాం. 

  • ఒక అరటి పండు గుజ్జుకి చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే విటమిన్ ఏలోపం నివారించబడి,పొడిబారిన చర్మం కాంతిని సంతరించుకుంటుంది.
  • అరటి పండు గుజ్జును కళ్లకింద ఏర్పడిన నల్లని వలయాల మీద రాసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే నలుపు పోతుంది.
  • పగిలిన మడమలకు రోజూ అరటి పండు గుజ్జు రాసి పావుగంట తర్వాత కడుగుతుంటే వారంలో మంచి మార్పు కనిపిస్తుంది.
  • ఒక అరటి పండు గుజ్జు, అర కప్పు పెరుగు కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగితే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు పరిష్కారం అవుతాయి.
  • మొటిమలు ఉన్నవారు అరటి తొక్కతో 5 నిమిషాలు ముఖాన్ని మర్దన చేస్తే వారంలో మొటిమలు మాయమవుతాయి.
  • అరటి తొక్క గుజ్జుకు గుడ్డుసొన కలిపి ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి 10 నిమిషాల తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మెత్తపడుతుంది. 



Recent Stories







bpositivetelugu

చిన్నారుల్లో మానసిక ఒత్తిళ్లు

విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ

MORE
bpositivetelugu

జంటనగరాల బోనాల వేడుకలు

ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ,

MORE