ఈ ఏడాదికి చలికాలం వచ్చేసినట్లే. వారం రోజులుగా చలి క్రమంగా పెరుగుతూ పోతోంది. ఈ చలి ధాటికి శరీరంలో ముందుగా దెబ్బతినేది చర్మమే. ముఖ్యంగా పెదాలు, ముఖం, చేతులు, పాదాలు, కురులపై చలిగాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చర్మం పొడిబారి దురద పెట్టటం,పెదాలు పగలటం,ముఖం మీద మచ్చలు ఏర్పడటం, పాదాల పగుళ్లు, జుట్టు రాలటం, చివరలు చిట్లిపోవటం, ముఖ చర్మం బిరుసెక్కిపోవటం వంటి ఎన్నో చర్మ సమస్యలు ఈ కాలంలో చాలా సహజంగా ఉంటాయి. ఇక.. ఈ కాలంలోనే చర్మ సంబంధిత వ్యాధులు కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి. అందుకే తగిన జాగ్రత్తలు, చిట్కాలను పాటించి ఈ 3 నెలలూ చలిబారి నుంచి చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాచేద్దాం

  • ఈ సీజన్లో ఒళ్ళంతా కప్పే పొడి, వెచ్చని దుస్తులు ధరించాలి. రాత్రి వేళ స్వెటర్, గ్లౌజులు, సాక్సులు తొడుక్కోవాలి.
  • ఈ 3 నెలలూస్నానానికి సబ్బు బదులుగా సున్నిపిండి వాడాలి. సబ్బు కావాలనుకునే వారు సాధారణ సబ్బులకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడాలి. స్నానానికి వాడే గోరువెచ్చని నీటిలో 2 చెంచాల కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి ఆ నీటితో స్నానం చేస్తే సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసిచర్మం మృదువుగా మారుతుంది.
  • చలికాలంలో కనీసం 3 రోజులకోసారి గోరువెచ్చని నువ్వుల నూనెను ఒంటికి పట్టించి సున్నిపిండితో రుద్ది గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వల్ల చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు.
  • స్నానం చేసిన తరువాత తప్పనిసరిగా ముఖానికి 'విటమిన్ ఇ' ఉండే క్రీమ్ రాసుకోవాలి. ఇతర కాలాల్లో వాడే తేలికపాటి మాయిశ్చరైజర్‌ స్థానంలో మరింత తేమనిచ్చేడి ఎంపిక చేసుకోవాలి.
  • చలికాలంలో నీరు తాగటం కాస్త తక్కువ గనుక పండ్ల రసాలు, తేనె, పచ్చి కూరగాయలు, సూపులు వంటివి అధికంగా తీసుకోవాలి.
  • బియ్యప్పిండి, తేనె సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మానికి కండిషనర్ అందినట్లే. ఇందులో బియ్యప్పిండి మంచి స్క్రబ్‌లా పనిచేసి మృతకణాలను తొలగిస్తుంది.తేనె చర్మానికి తగినంత తేమనిస్తుంది.
  • చలికి చర్మం బాగా పొడిబారి చిట్లుతుంటే ఉడికించి గుజ్జు చేసిన ఓట్స్‌ మిశ్రమాన్ని రాసుకుని ఆరిన తరవాతచల్లని నీటితో కడిగితే చర్మం మంట తగ్గుతుంది.
  • ఒంటిపై ముఖ్యంగా ముఖం మీద మచ్చలు, ట్యాన్ ఉన్నవారు 2 చెంచాల పెరుగులో పావు చెంచా పసుపు, అరచెంచా శెనగపిండి కలిపి రాసుకుంటే మచ్చలు, ట్యాన్ వదిలిపోతాయి.
  • శీతాకాలంలో ద్వి చక్ర వాహనాల మీద తిరిగే వారికి చలి గాలికి కళ్ళలో నీళ్లు రావటం, దురద పెట్టటం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటివారు హెల్మెట్ వాడటం, కళ్ళ జోడు ధరించటం, ఐ డ్రాప్స్ వాడటం తప్పనిసరి.
  • పెదాల మీద తైల గ్రంథులు ఉండవు గనుక ఈ కాలంలో పెదాలు త్వరగా పొడిబారి పగులుతాయి. అందుకే రోజుకు కనీసం 8గ్లాసుల నీళ్ళు తాగాలి. ప్రతి 2 గంటలకోసారి లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లి రాస్తుండాలి. పెదాలను నాలుకతో తడుపుకోవటం మానేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE