ఆరోగ్యానికి కొబ్బరి నీళ్లు ఎంత మేలు చేస్తాయో సౌందర్య పోషణకు కొబ్బరిపాలు అంతకంటే ఎక్కువగా దోహదపడతాయి. చర్మ, కేశ సౌందర్య పరిరక్షణకు అవసరమైన ఎన్నో పోషకాలు కొబ్బరిపాలలో ఉంటాయి. కొబ్బరిపాలతో సౌందర్య పరిరక్షణ ఎలాగో తెలుసుకుందాం. 

  • ఎండ ధాటికి కమిలి దెబ్బతిన్న చర్మంపై కొబ్బరిపాలలో ముంచిన దూదితో 5 నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయటం వల్ల కందిన, నల్లబడిన చర్మం సరికొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
  • గోరువెచ్చని బకెట్టు స్నానపు నీటిలో అరకప్పు కొబ్బరి పాలు, గుప్పెడు గులాబీ రేకులు, చెంచా తేనె వేసి కలిపి ఆ నీటితో స్నానం చేస్తే చలి కారణంగా పొడిబారిన చర్మానికి తగినంత తేమ అంది చర్మం కాంతివంతం అవుతుంది.
  • చెమట ఎక్కువగా పోసి, దానికి కాలుష్యం, ధూళి ప్రభావం తోడైతే పలు వ్యర్ధాలు చర్మంపై పేరుకుపోయి మొటిమలు, కురుపులు ఏర్పడటం సహజమే. 10 చెంచాల కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని పావుగంటపాటు అలాగే ఉంచి తర్వాత దూదితో ముఖమంతా అద్ది ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం పై పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.
  • అర కప్పు చిక్కని కొబ్బరి పాలలో చెంచా తేనె, 2 చెంచాల బియ్యపు రవ్వ, చెంచాబాదం నూనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. 5 నిమిషాలపాటు మర్దనా చేసి ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తేపాదాలు మృదువుగా మారతాయి.
  • కప్పు కొబ్బరిపాలలో చెంచా నిమ్మరసం కలిపి 2 గంటలు ఫ్రిజ్‌లో 2-3 ఉంచి తీసి ఆమిశ్రమాన్ని మాడుకు పట్టించి వేడినీటిలో ముంచిన ఉన్ని టవల్‌ను తలకు చుట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూ వాడి తలస్నానం చేయాలి. కనీసం వారానికి 2 సార్లు ఇలా చేయటం వల్ల వెంట్రుకలు రాలడం తగ్గతమే గాక జుట్టు మృదువుగా తయారవుతుంది.
  • చిట్లిన, పొడిబారిన జుట్టుకు కొబ్బరి పాలను బాగా పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేస్తుంటే జుట్టుకు తగినంత తేమ అంది పూర్వశోభను సంతరించునుకొంటుంది. జుట్టు కుదుళ్లు కూడా బలపడి జుట్టు రాలటం ఆగిపోతుంది.

 Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE