మహిళల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు అవాంఛిత రోమాల సమస్య కనిపిస్తుంది. పురుషుల మాదిరిగా పై పెదవి, చెంపలు, చేతుల, ఛాతీమీద వచ్చే ఈ రోమాల వలన మహిళలు తీవ్రమైన ఆత్మ న్యూనతకి లోనవుతారు. కొందరు షేవింగ్ వంటిమార్గాలను ఆశ్రయించి సమస్యను మరింత క్లిష్టతరం చేసుకుంటారు. ఈ సమస్య వున్నవారు ఈ కింది అంశాల మీద దృష్టి సారిస్తే అవాంఛిత రోమాల సమస్య పూర్తిగా అదుపులో ఉంటుంది.

కారణాలు

మహిళల్లో 'టెస్టోస్టిరోన్' అనే పురుష హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ కావటం వల్ల అవాంఛిత రోమాల సమస్య వస్తుంది. అందుకే వీరు సోయాగింజలు, సోయాపాలు ఎక్కువగా తీసుకోవటం వల్లవారి శరీరంలో పురుష హార్మోన్ స్థాయిలు తగ్గి స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ పెరిగి సమస్య అదుపులో ఉంటుంది. జన్యుపరమైన కారణాల వల్ల కూడా అవాంఛిత రోమాల సమస్య కనిపించవచ్చు.

నివారణ, చికిత్సలు

  • అవాంఛిత రోమాలు కనిపించినప్పుడు పొరబాటున షేవ్ చేయకూడదు. పొరబాటున ఒక్కసారి రేజర్ వాడితే రోమాలు వేగంగా పెరుగుతాయి. ఇలా పెరగటం మొదలైన తర్వాత వాటిని నియంత్రించటం కష్టం అవుతుంది.
  • ముఖ భాగంలోని వెంట్రుకలను ట్వీజర్ సాయంతో ఒక్కో వెంట్రుకను కుదుళ్ళతో సహా తొలగించవచ్చు. దీనివల్ల 4-6 వారాల వరకు వెంట్రుక రాకుండా చేయవచ్చు. అయితే ఈ పద్దతి ముఖ భాగపు వెంట్రుకలకు పనిచేసినట్లు ఛాతీ భాగపు రోమాలకు పనిచేయదు.
  • అవాంఛిత రోమాల సమస్యకు వ్యాక్సింగ్ చెప్పుకోదగ్గ తాత్కాలిక పరిష్కారం. తరచూ వ్యాక్సింగ్చేయటం వల్ల రోమాల ఎదుగుదల తగ్గుతుంది. వ్యాక్సింగ్చేయించుకునేవారు రోమాలు కాస్త పెరిగిన తర్వాత చేయించుకుంటే వెంట్రుకలన్నీ ఒకే సారి ఊడి వస్తాయి.
  • రోజూ వ్యాయామం చేయటం వల్ల అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది.
  • అవాంఛిత రోమాల సమస్యకు పలు రకాల డెపిలేటరీ క్రీములు, లోషన్లు అందుబాటులో ఉన్నాయి. తొలిసారి వాడినప్పుడు సున్నితమైన చర్మం ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది. కంటికింది భాగంలో వీటిని రాయవద్దు. వైద్యుల సలహా మేరకు వాటిని వాడవచ్చు. వీటిని కొనేటప్పుడు సదరు ఉత్పత్తి తయారీలో అలర్జీ కారకాలున్నాయేమో పరిశీలించాలి.
  • అవాంఛిత రోమాల సమస్యను పూర్తిగా, శాశ్వతంగాతొలగించుకోవాలంటే ఎలక్ట్రోలిసిస్, ఇంటెన్స్ పల్సెడ్ లైట్, లేదా లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE