ఇప్పటి అమ్మాయిలు హైహీల్స్ ఎక్కువగా వాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉండేవారు వీటిని ఎక్కువగా వాడుతున్నారు.అయితే వీరిలో చాలామందిశరీర బరువు, శరీర నిర్మాణం వంటి కీలక అంశాలను విస్మరించి హైహీల్స్ వాడటం వల్ల వెన్ను, కీళ్ల సమస్యల బారిన పడుతున్నారు. అందుకే హైహీల్స్ వాడేవారికి వీటిపట్ల తగిన అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. 

 • మడమ ఎత్తుగా ఉండే హైహీల్స్ వల్ల శరీర బరువు పాదం మీద ఏకరీతిగా గాక కేవలం కాలి ముందు భాగం మీద పడుతుంది. దీనివల్ల కాలివేళ్లు,మోకాలు, కీళ్లపై ఒత్తిడి పెరిగి తొడ కండరాల కదలిక కష్టమవుతుంది. దీనివల్ల మోకాలి కీలు వేగంగా అరిగిపోతుంది. 
 • హీల్‌ సైజు పెరిగే కొద్దీ వెన్నుపూస, తొడ, మోకాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు సరైన భంగిమలో నిలబడకపోతేఈ ఒత్తిడి మరింత పెరిగుతుంది. అంగుళం హీల్‌ ఉంటే 22 శాతం, 2 అంగుళాల హీల్‌ వల్ల 57 శాతం, 3 అంగుళాల హీల్‌ ఉంటే 75 శాతం అధికంగా కాలి కండరాలు ఒత్తిడికి గురవుతాయి. 
 • ఊబకాయులు, అధిక బరువున్న వారుహైహీల్స్ వాడితే వెన్ను దివా భాగం మీద ఒత్తిడి ఎక్కువై నడకలో తేడా వచ్చి స్పాండిలైటిస్‌కు దారితీస్తుంది. 
 • ఎక్కువ కాలం హైహీల్స్‌ వాడితే చీల మండ వద్ద ఉండే 'ఎచిలిస్‌ టెండాన్‌' కురచగా మారి కండరాల నొప్పికి కారణం అవుతుంది. గిలక భాగంలో రక్తప్రసరణ తగ్గి అక్కడి నరాలు బలహీన పడతాయి. 
 • దీర్ఘకాలం హైహీల్స్ వాడేవారికిపాదాలపై ఆనెలు, పొక్కులు, గోళ్ల ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఏర్పడి నడవలేని పరిస్థితి కూడా రావచ్చు. 
 • పాదాలు నొప్పిగా ఉన్నా హైహీల్స్‌ వాడితే మడమ భాగంలో లోపం ఏర్పడుతుంది. దీన్ని సరిచేసేందుకు సర్జరీ కూడా అవసరం కావచ్చు. 
 • హైహీల్స్‌ ధరించే వారిలో మెదడు నరాలు ఒత్తిడికి గురై.. న్యూరోమా అనే మెదడు సమస్యగానూ మారొచ్చు.
 • హీల్స్ వల్ల ఒక్కోసారి జారిపడి తుంటి వంటివి విరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

నిపుణుల మాట

 • హైహీల్స్ వాడేవారు ముందుగా ఎత్తు, బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
 • అత్యంత అవసరమైన సందర్భాల్లోనేహైహీల్స్‌ వాడాలి. మిగిలిన సందర్భాల్లోచెప్పులు, షూ వేసుకోవాలి.
 • హైహీల్స్ వేసుకున్నవారు కనీసం కూర్చున్నప్పుడు వాటిని వదిలి పాదాలను నేలకు ఆనించి పెట్టుకోవటం వల్ల కొంత ఒత్తిడి తగ్గుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE