• HOME
  • అందం
  • సౌందర్య పోషణకు ద్రాక్ష

రుచికి తియ్యతియ్యగా, పుల్లపుల్లగా అనిపించే ద్రాక్ష పండ్లు సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్షలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సరికొత్త మెరుపును  తీసుకొస్తాయి. ద్రాక్ష పండ్లలోని పాలిఫినాల్స్‌ శరీరంలో కొల్లాజిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పైటోకెమికల్స్‌ కణాల క్షీణతను తగ్గించటంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి వేస్తాయి. వయసుతో బాటు చర్మంలో వచ్చే మార్పులను ద్రాక్షలోని పోషకాలు ఆలస్యం చేసి నడివయసులోనూ యవ్వనపు శోభను నిలుపుతాయి. సౌందర్య పోషణకు ద్రాక్ష ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

  • గుప్పెడు ద్రాక్షపళ్ళను అరచేతులతో బాగా నలిపి మెత్తని ముద్దగా చేసుకుని, దానికి చెంచా తేనె కలిపి, ఆ గుజ్జును ముఖానికీ మెడకీ బాగా పట్టించాలి. పావుగంట తర్వాత చన్నీటితో  కడిగేసుకుంటే ముఖచర్మం మీద పేరుకున్న మురికి, జిడ్డు దూరమై చర్మం కోమలంగా మారి, మెరిసిపోతుంది.
  • పొడి చర్మంతో బాధపడే వారు చెంచా చొప్పున గుడ్డు తెల్లసొన, ద్రాక్ష పండ్ల రసాన్ని కలిపి ముఖానికి బాగా పట్టించి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • కళ్ల దిగువన నల్లని వలయాలు, ముడుతలు ఉన్నవారు ద్రాక్ష పండును అడ్డంగా కోసి దానితో కంటికింది ముడతలు, వలయాల మీద 3 నిమిషాలు రుద్ది ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వార్మ్ రోజులు చేస్తే కంటికింది చర్మం పలుచబడి  ముడుతలు, మచ్చలు మాయం అవుతాయి.
  • 3 చెంచాల ద్రాక్షరసం, 5 చెంచాల పెరుగు, చెంచా నారింజ రసం కలిపి ముఖాన్నీ మర్దన చేసి, చివరగా ప్యాక్ వేసుకోవాలి. ఇది వయసు ప్రభావం కనిపించనివ్వకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
  • ద్రాక్షలకు మొటిమలూ, వాటి మచ్చల్నీతగ్గించే గుణం ఉంది. 6 ద్రాక్ష పళ్లని మెత్తగా చేసి, దానికి పావు చెంచా గోధుమ పిండి, చిటికెడు బేకింగ్‌ సోడా కలిపి మొటిమలు లేదా వాటి మచ్చల మీద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.



Recent Stories







bpositivetelugu

చిన్నారుల్లో మానసిక ఒత్తిళ్లు

విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ

MORE
bpositivetelugu

జంటనగరాల బోనాల వేడుకలు

ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ,

MORE