చలికి పాదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నాయా? పగుళ్లిచ్చిన మడమలతో నలుగురిలోకి వెళ్లాలంటే సిగ్గుగా ఉంటోందా? పగిలిన మడమల నుంచి రక్తస్రావం అవుతోందా? అయితే .. మీరు మీ పాదాల ఆరోగ్యాన్ని కనీసం పట్టించుకోవట్లేదని అర్థం. రోజంతా శరీర బరువును మోసి ఎంతో అలసి పోయే పాదాలు కాలుష్యం, చలి వంటి బాహ్య ప్రభావాలకు లోనై తీవ్రంగా దెబ్బతిని తమ సహజ సౌందర్యాన్ని కోల్పోతాయి. అయితే ఈ దిగువ పేర్కొన్న కొన్ని జాగ్రత్తలు, చిట్కాలను పాటించటం ద్వారా పై సమస్యలు దూరమై అందమైన పాదాలు సొంతమవుతాయి. 

  • సాయంత్రం స్నానం చేసేటప్పుడు దెబ్బతిన్న పాదాలను స్క్రబ్బర్ తో తేలికగా రుద్దటం వల్ల అక్కడ పేరుకున్న మురికి, మృతకణాలు తొలగిపోతాయి.
  • మడమల పగుళ్లు పోవాలంటే రాత్రి పడుకోబోయేముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని కాలి వేళ్ళు, అరికాలు మొదలు మడమల వరకు బాగా రుద్ది మర్దన చేసి సాక్స్ వేసుకొని తెల్లవారి లేచాక గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి. అదే .. బాదం నూనెను వాడితే పగుళ్ల సమస్యతో బాటు కాలిమీఁది మచ్చలు కూడా తొలగిపోతాయి. 
  • సాయంకాలం స్నానానికి ముందు బకెట్టులొ సగం గోరువెచ్చని నీరు పోసి, అందులో గుప్పెడు కల్లు ఉప్పు వేసి, 2 నిమ్మ చెక్కలు పిండి పాదాలను ఆ నీటిలో 15 నిమిషాలు ఉంచి స్క్రబ్బర్ తో రుద్ది స్నానం తర్వాత క్రీమ్ రాస్తే పాదాలకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. పగుళ్ల బెడద కూడా తగ్గుతుంది. 
  • తాజాగా సేకరించి రుబ్బిన గోరింటాకును దెబ్బతిన్న అరికాలి చర్మం, పగుళ్లిచ్చిన మడమలకు పెట్టి 2 బాగా ఆరాక చన్నీటితో కడిగితే పగుళ్ల సమస్య తగ్గుతుంది.
  • బొప్పాయి గుజ్జును మడమలకు పట్టించి మర్దన చేసి ఆరాక కడిగితే పాదాల చర్మం మెత్తబడి పగుళ్ల తీవ్రత తగ్గుతుంది. 
  • గుప్పెడు వేపాకు, పావు చెంచా పసుపు, చిటికెడు పొడి సున్నం కలిపి నూరి, అరచెంచా ఆముదం చేర్చి పగుళ్లిచ్చిన మడమపై రాసి మర్దన చేసి ఆరాక చన్నీటితో కడిగేయాలి. తరచూ ఇలా చేయటం వల్ల పగుళ్లు మాయం అవుతాయి. 
  • చెంచా చొప్పున ఆముదం, కొబ్బరి నూనె కలిపి అందులో పావుచెంచా పసుపు చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్ల సమస్య రాదు. 
  • సౌకర్యవంతమైన, నాణ్యమైన పాదరక్షలు, షూ వాడటంతో బాటు చెప్పులు వాడే వారు సైతం మెత్తని సాక్సులు వాడటం వల్ల పాదాలకు మురికి, కాలుష్యం, వేడి, చలి వంటి బాహ్య ప్రభావాలనుంచి రక్షణ లభిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE