• HOME
 • అందం
 • పెళ్ళికి ముందు చర్మ సంరక్షణ

పెళ్ళికి ముందునుంచే వధూవరులు సౌందర్య పోషణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టటం సహజమే. ఈ క్రమంలో వీరు చర్మ, కేశ సంబంధిత అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. వధూవరులు పెళ్లి, ఆ తరవాత జరిగే రెసెప్షన్ వేడుకల్లో అందరి దృష్టినీ ఆకర్షించేలా చేసే కొన్ని సౌందర్యపరమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

 • పెళ్ళికి 2 నెలల ముందే చర్మ స్వభావానికి తగిన హెర్బల్ క్రీములు, ఫేస్ ప్యాక్ లను నిపుణుల సలహాపై వాడాలి. దీనివల్ల మంగు, కంటి కింద ఏర్పడిన నల్లని వలయాలు, మొటిమల మచ్చల వంటి సాధారణ చర్మ సమస్యలు ఉంటే తొలగిపోతాయి.
 • పెళ్ళికి 2 నెలల ముందు నుంచే వారానికోసారి ఆయిల్ మసాజ్, క్రీమ్ మసాజ్ చేయించుకొంటే చర్మం పైపొరలో చేరిన వ్యర్ధాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. మసాజ్ సమయంలో మెడ, మడమలు, చేతులు, నడుము తదితర భాగాల్లోని చర్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.
 • చెంపలు, పై పెదవి, గడ్డం పై అవాంఛిత రోమాలు ఉన్న అమ్మాయిలు లేజర్ చేయించుకోవాలనుకుంటే పెళ్ళికి కనీసం 4 నెలల ముందు చేయించుకోవం మంచిది.
 • సాధారణ క్రీముల ప్రభావానికి లొంగని మొండి మచ్చలు, గాయాల మచ్చల విషయంలో లేజర్ చికిత్సల సాయం తీసుకోవచ్చు.
 • పెళ్ళికి ముందు నుంచే ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి 3, బి 12, యాంటీ ఆక్సిడెంట్లు లభించే ఆహారం తీసుకోవటం ద్వారా చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.
 • పెళ్ళికి 2 నెలల ముందునుంచే కురుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇందులో భాగంగా రోజూ నూనె పెట్టటం, వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేసి కండిషనర్ వాడటం అవసరం.
 • పల్చని, బలహీనమైన కురులున్న వారు పెళ్ళికి 2 నెలల ముందుగా మీసోథెరపీ చేయించుకొంటే జుట్టు కుదుళ్ళు బలపడి పెళ్లినాటికి అందంగా, బలంగా తయారవుతాయి.
 • పెళ్ళికి ముందునుంచే తేలికపాటి వ్యాయామంతో బాటు యోగా చేస్తే హార్మోన్ల హెచ్చుతగ్గులు, రక్తప్రసరణ లోపాలు, ఒత్తిడి వంటి సమస్యలు దూరమై శరీరంతో బాటు మనసూ ఉల్లాసంగా మారుతుంది.
 • 35 ఏళ్ళు పైబడిన వధూవరులు నిపుణులను సంప్రదించి మైక్రో ఇంజెక్షన్స్ వాడటం ద్వారా వయసు కారణంగా వచ్చిన మార్పులను సరిచేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE