• HOME
  • అందం
  • లిప్‌స్టిక్ మరింత మెరవాలంటే..

లిప్‌స్టిక్ వినియోగం పెదవుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. ధరించిన దుస్తులు, ముఖాకృతి, శరీర రంగు, సందర్భం తదితర అంశాలను బట్టి లిప్‌స్టిక్ వాడితే అతివల అందం మరింత ఇనుమడిస్తుంది. ఈ అంశం మీద నిపుణులు సూచిస్తున్న కొన్ని సలహాలు మీ కోసం... 

లిప్‌స్టిక్‌ వేసుకొనే ముందు

  • లిప్‌స్టిక్‌ రాసుకునే ముందు పాలలో ముంచిన దూదితో పెదాలను శుభ్రం చేయాలి. లేకపోతే లిప్‌స్టిక్‌ పేలవంగా కనిపిస్తుంది.
  • చలికాలంలో పెదవులు త్వరగా పొడిబారతాయి గనుక ముందుగా పెదవులకు కొబ్బరినూనె రాసి 10 నిమిషాలు ఆగి వెచ్చని నీటిలో ముంచిన దూదితో తుడిచి లిప్‌స్టిక్ వేసుకుంటే పెదవులకు తగిన తేమ చేకూరి లిప్‌స్టిక్‌ ఎక్కువ సమయం సహజంగా కనిపిస్తుంది.
  • బాగా పగిలిన పెదవులకు నేరుగా లిప్‌స్టిక్ వేస్తే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది గనుక ముందుగా మెత్తటి కుంచెలున్న బ్రష్‌తో రుద్ది నీటితో కడిగి, లిప్‌బామ్ రాయాలి.
  • పెదాలను శుభ్రం చేసిన తర్వాత కొద్దిగా ఫౌండేషన్‌ క్రీము రాసుకుని 3 నిమిషాలు ఆరనివ్వాలి.
  • ఇప్పుడు ఎంతవరకు లిప్‌స్టిక్ రాయాలో అంతవరకు ముదురు గోధుమ రంగు, వాటర్‌ఫ్రూఫ్ ఐలైనర్‌తో కిందిపెదవి అంచు వద్ద చిన్న లైన్ గీసి లిప్‌స్టిక్ వేయటం ఆరంభించాలి. దీనివల్ల చిన్న పెదవులు సైతం కాస్త పెద్దగా, మరింత వంపుతిరిగినట్టు అందంగా కనిపిస్తాయి. ఎక్కువ వెడల్పు పెదాల వారు ముదురు రంగు లిప్‌స్టిక్‌ను ఎంచుకొంటే పెదాలు చిన్నగా కనిపిస్తాయి. 

లిప్‌స్టిక్ షేడ్ ఎంపిక

  • లిప్‌స్టిక్ పెదవుల రంగుతో కలిసి సహజ కాంతితో మెరవాలనుంటే న్యూడ్ లేదా క్లియర్ షేడ్స్ ఎంచుకోవాలి.
  • పెళ్లీడు అమ్మాయిలకు పింక్ లేదా వారి శరీర ఛాయకు నప్పే లేత గులాబీ షేడ్ వాడొచ్చు. అదే రంగు తక్కువ గలవారు ఆరెంజ్‌ షేడ్‌ వాడొచ్చు.ఉద్యోగినులకు నిండు షేడ్స్ నప్పుతాయి.
  • గోధుమ వర్ణపు కనుగుడ్డు గలవారికి పింక్‌ షేడ్స్, నీలికళ్ల వారికి ముదురు ఎరుపు, ఇటుక రంగు లేదా గోధుమ షేడ్స్ నప్పుతాయి. బూడిదరంగు కళ్లు కలవారికి ఆరెంజ్‌ షేడ్ బావుంటుంది.
  • తెల్లని ఛాయ గలవారికి నారింజ, ఎరుపు, ముదురు గోధుమ రంగులు, చామనఛాయ వారికి లేత గోధుమ రంగు నప్పుతుంది.

ఇతర అంశాలు

  • పగటి పూట లిప్‌స్టిక్‌ వేసుకుంటే కాస్త తక్కువగా, సాయంత్రం వేళ కాస్త ఎక్కువగా వేసుకోవాలి.
  • లిప్‌స్టిక్‌ వేయటం పూర్తయ్యాక చివరగా కాంతినిచ్చే షైనీ ఫినిష్‌తో టచప్ చేయాలి. లేకుంటే పెదవులు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE