• HOME
  • అందం
  • సమ్మర్ సరికొత్త ట్రెండ్స్

వేసవి వచ్చేసింది. ఈ సీజన్లో మండే ఎండ, ఊపిరి సలపనీయని ఉక్కపోతల ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యేకమైన దుస్తులు ధరించాల్సిందే. ఈ వేసవి దుస్తులు సౌకర్యంగా ఉండటంతో బాటు ట్రెండీగా ఉంటే సౌకర్యంతో బాటు సొగసునూ తెచ్చిపెడతాయి. వేసవి దుస్తుల ఎంపికలో పరిగణలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. 

ప్రాథమిక అంశాలు

వేసవిలో నమోదయ్యే పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే లేత రంగు దుస్తులు మంచిది. వీటిలో లేత నీలం, లేత గోధుమ రంగు, లేత గులాబీ రంగులైతే మరీ మంచిది. సాయంత్ర వేళలో నారింజ, ముదురు నీలం, చాక్లెట్‌ బ్రౌన్‌ రంగులు ఎంపిక చేసుకోవచ్చు. ఇక.. ‘సీ గ్రీన్‌’ రంగు దుస్తులైతే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. వేసవి దుస్తులు మరీ వదులుగా లేక బిగుతుగా లేకుండా తగినట్లు ఉండాలి. దీనివల్ల శరీరానికి గాలి తగిలి చెమట పట్టటం తగ్గటమే గాక పట్టిన చెమటను దుస్తులు ఎప్పటికప్పుడు పీల్చుకోవటం సాధ్యమవుతుంది. నిర్వహణ కాస్త కష్టమనిపించినా వేసవిలో మెత్తని నూలు వస్త్రాల ఎంపిక మంచిది. డ్రెస్ కోడ్ పాటించే వారు సైతం కాటన్ జీన్స్, షర్టులు ఎంపిక చేసుకోవచ్చు.

ట్రెండ్ పరంగా..

  • వేసవిలో నూలు(కాటన్) దుస్తులు మంచిదే. అయితే మహిళలు మరీ ఏ డిజైన్ లేని సాదా దుస్తులను ఇష్టపడరు గనుక వారు ప్రింటెడ్ కాటన్ దుస్తులు ఎంపిక చేసుకోవాలి. ఇలాంటివారికి పగటి ఎండధాటికి నిలిచి, చెమటను పీల్చుకొనే లినన్‌ కాటన్‌, ఆర్గంజ, వంటివి మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అదే.. సాయంత్రం వేళ కశ్మీరీ సిల్క్‌, మట్క సిల్క్‌, క్రేప్‌ సిల్క్‌ వంటివైతే సౌకర్యంగా ఉండటంతో బాటు అందంగానూ కనిపిస్తారు.
  • గృహిణులు ఫ్రింటెడ్‌ కాటన్‌ చీరలతో బాటు లినన్‌, హ్యాండ్‌లూమ్‌, కోట రకం చీరలు ఎంపిక చేసుకోవచ్చు. వేసవిలో ఏదైనా విందులకు వెళ్లాల్సిన సందర్భాల్లో చందేరి సిల్క్‌ బాగుంటుంది. అయితే.. బ్రొకేడ్స్‌, వెల్వెట్ ల జోలికిపోవద్దు.
  • కాలేజీ యువతులు, ఉద్యోగినులు సాదా కాటన్ కుర్తాలతో బాటు ఫ్రింటెడ్‌ బాటమ్‌తో వచ్చిన మంగళగిరి కుర్తాలను వాడొచ్చు. ఇంకాస్త భిన్నంగా ఉండాలనుకొంటే వాటికి.. పెద్ద పెద్ద బటన్‌లు, కాలర్ల డిజైన్లు ఎంపికచేసుకోవచ్చు . అయితే.. వేసవిలో లాంగ్‌ సల్వార్లు లేదా కుర్తాల జోలికి పోవద్దు.
  • ప్రింట్ దుస్తులు కొనేటప్పుడు మరీ పెద్ద ఫ్రింట్లు గల డిజైన్లు కాకుండా చిన్న, సన్నని ఫ్రింట్‌ గల దుస్తులు ఎంపిక చేసుకొంటే ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. ఫాషన్ కంటే సౌకర్యమే ాముఖ్యమనుకొంటే ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.
  • వెస్ట్రన్‌ వేర్‌ ఇష్టపడేవారు లినన్‌ ప్యాంట్ల మీద ముదురు రంగు టీషర్టులు వేసుకుంటే మంచి లుక్‌ వస్తుంది.
  • దుస్తుల ఏమ్పికతో బాటు హాండ్వే బ్యాగ్, చెప్పుల ఎంపికలో తగిన అభిరుచి అవసరం. వేసవిలో లెదర్‌, రెగ్జిన్‌ హ్యాండ్‌ బ్యాగ్‌ల స్థానంలో కాటన్‌, జూట్‌, ఒవెన్‌, హ్యాండ్‌ ఒవెన్‌ బ్యాగులు, హ్యాండీక్రాఫ్టెడ్‌ బ్యాగులు ఎంపిక చేసుకుంటే త్వరగా వేడెక్కకుండా ఉండటమే గాక అందంగానూ ఉంటాయి. చౌకధరలోను దొరుకుతాయి. చివరగా శాండిల్స్‌ విషయానికొస్తే.. లెదర్‌ శాండిల్స్‌ బదులు లినన్‌ శాండిల్స్‌ వాడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE