• HOME
  • అందం
  • ముఖవర్చస్సు పెంచే కలబంద

ముఖ సౌందర్యాన్ని కాపాడుకొనేందుకు మహిళలు ఎంత శ్రమిస్తారో తెలిసిందే. చాలామంది మహిళలు ఇందుకోసం ఖరీదైన పౌడర్లు, క్రీములు వాడటమూ చూస్తుంటాం. ఒక్కోసారి ఈ ప్రయత్నాలు వికటించటమూ జరుగుతోంది. అయితే.. బోలెడంత ఖర్చయ్యే ఈ ప్రయత్నాలకు బదులు కలబంద వాడితే చౌకగా, సురక్షితంగా అందాన్ని పెంపొందించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించే కలబంద విషయంలో నిపుణులు ఇస్తున్న మరిన్ని సూచనలు తెలుసుకుందాం. 

  • కలబంద ఆకులకు నీటిని పీల్చుకునే గుణం ఉన్నందున తరచూ దీన్ని వాడితే ముఖ చర్మంలో తగినంత తేమ నిలిచి పొడిబారకుండా ఉంటుంది. చర్మం ప్రకాశ వంతంగానూ మారుతుంది.
  • కాలిన చర్మపు గాయాలు, పడిన మచ్చలు మీద కలబంద గుజ్జును రాస్తుంటే కొంతకాలానికి అవనీ మటుమాయమౌతాయి.
  • కలబంద గుజ్జును కొబ్బరి నూనెతో కలిపి మోచేతులు, పాదాల వద్ద నల్లగా మారిన చర్మంపై రాస్తే నలుపు తగ్గి చర్మం కలిసిపోతుంది.
  • పరగడుపున అరచెంచా కలబంద గుజ్జు సేవిస్తే ఉదర సంబంధ సమస్యలు బెడద లేనట్లే.
  • రోజ్‌ వాటర్‌లో కలబంద గుజ్జు కలిపి చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.
  • కలబంద గుజ్జును ముల్తానీ మట్టి లేక గంధపు పొడితో కలిపి మొటిమలకు రాస్తే మొటిమలు మాయమవుతాయి.
  • కలబందతో చేసిన సబ్బులు, క్రీములను వాడటం వల్ల ముఖం మీది ముడతలు తగ్గటమే గాక సన్‌స్క్రీన్‌గానూ పనిచేస్తుంది. అలాగే చర్మసమస్యల బెడదా ఉండదు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE