• HOME
  • అందం
  • టాటూ వేయించుకుంటున్నారా?

నేటి యువత తమ వ్యక్తిత్వాన్ని, అభిరుచులను వ్యక్తీకరించే మాధ్యమంగా టాటూను భావిస్తున్నారు. నాటికాలపు పచ్చబొట్లే ఈనాటి టాటూలకు స్ఫూర్తి. చిన్న చిన్న టాటూలు వేయించుకొనే వారిమొదలు వేలం వెర్రిగా ఒళ్లంతా వేయించుకొనేవారూ మనకు కనిపిస్తారు. వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేసే టాటూలు కొన్ని వృత్తులవారికి ఫ్యాషన్ పరంగా ఆవశ్యకంగా మారాయంటే ఆశ్చర్యం లేదు. స్థూలంగా ఇవి రెండు రకాలు. పచ్చబొట్ల మాదిరిగా చెరగనివి, కావాలనుకున్నప్పుడు చెరిపేసుకొనే వీలున్నవి. అయితే..ఫ్యాషన్ పేరుతో వేయించుకొనే టాటూ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యల బారిన పడాల్సిరావచ్చని ఫ్యాషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో వారు సూచిస్తున్న కొన్ని అంశాలు.. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • అర్హత, నైపుణ్యం ఉన్నవారి చేతే టాటూ వేయించుకోవాలి. ఈ విషయంలో రాజీ పడితే చర్మ సమస్యలు తప్పవు.
  • గతంలో టాటూ వేయించుకొని చర్మ సమస్యల బారిన పడినవారు ఈ విషయాన్ని ముందుగా టాటూ డిజైనర్ కు ముందుగా చెప్పాలి.
  • ఆలోచనలు, అభిరుచులు కాలంతో బాటు మారతాయి కనుక కోరుకున్నప్పుడు చెరిపేసుకొనే టాటూలు వేయించుకోవటం మంచిది.
  • అనారోగ్యంతో ఉన్న సమయంలో టాటూ వేయించుకోవద్దు.
  • టాటూ వేయించుకొనే ముందు మద్య పానం, మత్తు పదార్ధాలను సేవనం పనికిరాదు.
  • టాటూ కోసం వాడే రసాయనాలు, వాటి మూలంగా వచ్చే తలెత్తే ప్రతికూల ప్రభావాల గురించి ముందే తెలుసుకోవటం మంచిది.
  • సున్నితమైన ప్రదేశాల్లో టాటూలు వేసేప్పుడు లోకల్‌ అనస్థీషియా తీసుకోవటమే మంచిది.
  • ఎండలో బయటకు వెళ్ళినప్పుడు టాటూ మీద నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. లేకుంటే.. టాటూ వేసిన భాగంలో చర్మం సున్నితంగా మారి చర్మ సమస్యలు రావచ్చు.
  • ఎండలో బయట వెళ్ళడానికి ముందు టాటూ మీద సన్ స్క్రీన్ లోషన్ రాసుకొంటే మంచిది.
  • టటూ వేయించుకున్న తొలిరోజుల్లో మాయిశ్చరైజ్ రాయటం వల్ల ఇన్ఫెక్షన్స్, వాపు, వంటివి త్వరగా తగ్గుతాయి.
  • టాటూ మీద స్క్రబ్బింగ్ పేరుతో ఎడాపెడా రుద్దితే టాటూ చెరిగిపోతుందని గుర్తుంచుకోవాలి.
  • టాటూ వేయించుకొన్నవారు స్నానానికి నాణ్యమైన సోపును వాడాలి.
  • మహిళలు వాక్సింగ్ చేయించుకోవాలనుకుంటే టాటూ వేయించుకోవడానికి ముందే చేయించుకోవటం మంచిది.
  • టాటూ వేసినచోట చర్మం పొడిగా, వాపుగా అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. 

గమనిక: శారీరక పరీక్షలు అవసరమైన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే యువత శాశ్వత టాటూల జోలికి వెళ్లకపోవటమే మంచిది.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE