సౌందర్యం విషయంలో కురుల పాత్ర ఎంతో కీలకం. యుక్త వయసు వారి అందం విషయంలో ఇది మరింత నిజం. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా ఒక్కోసారి జుట్టు చిట్లటం, బిరుసెక్కటం, రాలటం, నెరవటం వంటి సమస్యలు రావటం సహజమే. నిజానికి మనిషి జుట్టులో రోజుకి సుమారుగా 50- 100 వెంట్రుకలు రాలిపోతాయి. ఒకసారి కుదురు నుంచి మొలిచిన వెంట్రుక మొలకెత్తిన వెంట్రుక 2 నుంచి 5 ఏళ్ల వరకూ పెరిగి రాలిపోతుంది. ఆ తర్వాత అదే కుదురు నుంచి కొంత విరామం తర్వాత మరో వెంట్రుక మొలుస్తుంది. అయితే ఇవి చిన్నగా ఉండి కనిపించవు గనుక చాలామంది జుట్టు పలుచబడిందని ఆందోళన చెందుతుంటారు. అందుకే.. కురులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పోషణ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిందే. సమగ్ర కురుల సంరక్షణకు నిపుణులు ఇస్తున్న కీలక సలహాలేమిటో తెలుసుకుందాం.

సమస్యకు కారణాలు

 • పౌష్టికాహార లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. తీసుకున్న ఆహారంలోని ముఖ్యపోషకాలు ప్రధాన జీవక్రియల నిర్వహణకు సరిపోగా, మిగిలినవే వెంట్రుకలకు అందుతాయి. పోషకాహార లోపం ఏర్పడితే.. పోషకాలు అందక జుట్టు రాలటం మొదలవుతుంది. అందుకే ప్రొటీన్లున్న ఆహారం తీసుకోవాలి. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి.
 • జుట్టు రాలటానికి మరో ముఖ్య కారణం రక్తహీనత(అనీమియా). ఐరన్‌ లోపం తలెత్తే ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకొంటే ఈ సమస్య రాదు. తద్వారా జుట్టునూ సంరక్షించుకోవచ్చు.
 • హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. మహిళల్లో పురుష హార్మోన్‌ ఎక్కువవటం, థైరాయిడ్‌ హార్మోన్‌ మార్పుల వల్ల జుట్టు రాలటం కనిపిస్తుంది. ఈ సమస్యలకు ముందు నుంచే చికిత్స తీసుకోవాలి. అయితే.. గర్భిణుల్లో జుట్టు రాలిన ప్రసవం తర్వాత తిరిగి వేగంగా జుట్టు మొలుస్తుంది.
 • మానసిక ఒత్తిడి, మూర్చ, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యలకు వాడే ఔషధాలు, చికిత్సల వల్ల కూడా జుట్టు రాలుతుంది.
 • పేను కొరుకుడు, సొరియాసిస్ వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది.
 • ఏళ్లతరబడి మోతాదుకు మించిన సీసం, కాడ్మియం వంటి హానికారకాలున్న తాగునీరు తాగటం వల్ల కూడా జుట్టు రాలుతుంది.
 • రోజుకి కనీసం 10 గ్లాసుల నీరు తాగటం, 7 గంటలైనా నిద్రపోవటం తప్పనిసరి. లేకుంటే ఆ ప్రభావం జుట్టు మీద పడి రాలుతుంది.
 • ఫ్యాషన్‌లో భాగంగా వెంట్రుకలను బలంగా వెనక్కి లాగి పోనీ జడ వేసుకోవటం వల్ల నుదిటి భాగంలో జుట్టు మీద ఒత్తిడి పెరిగి అక్కడి వెంట్రుకలు ఊడిపోతాయి. వైద్యపరిభాషలో దీన్ని ట్రాక్షనల్‌ అలోపేషియా అంటారు.
 • వ్యక్తిగత శుభ్రతా లోపం వాళ్ళ కూడా జుట్టు రాలుతుంది. అందుకే వారానికోసారి కనీసం 2 సార్లు తలస్నానం చేయటం, చుండ్రు వంటి ఇబ్బందులుంటే చికిత్స తీసుకోవటం అవసరం.
 • సాధారణ, ఆయిలీ స్వభావం గల జుట్టున్నవారితో పోల్చితే పొడి  జుట్టుగలవారిలో జుట్టు రాలటం ఎక్కువ. ఇలాంటివారు తల స్నానానికి గంట ముందు నూనెతో జుట్టు కుదుళ్లకు మసాజ్‌ చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వీరు శీకాయ, కుంకుడు కాయలకు బదులుగా మైల్డ్‌ షాంపూ వాడాలి. ఆయిలీ స్వభావం గల జుట్టున్న వారు ఆయిల్‌ బేస్డ్‌ షాంపూలు , కండిషనర్‌ వాడరాదు. వీరు రోజూ తలస్నానం చేయటం మంచిది.
 • స్టయిలింగ్‌లో భాగంగా పదునైన, చిక్కని పళ్లున్న దువ్వెనతో పదే పదే దువ్వటం, స్టయిలింగ్‌ చేయటం వల్ల జుట్టు చివర్లు దెబ్బతింటాయి.రోజూ స్ట్రయిటెనర్స్‌, డ్రయర్స్‌ వాడకం మూలంగా వచ్చే వేడి వల్ల కూడా జుట్టు చివర్లు చిట్లుతాయి.
 • చాలామందిలో జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు ఊడుతుంది. 

పరిష్కారాలు

పై వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాల వల్ల వంశపారంపర్యంగా వచ్చిన జుట్టు సమస్యలకు తప్ప మిగిలిన అన్ని కారణాల వల్ల వచ్చిన జుట్టు సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. వంశపారంపర్యంగా వచ్చిన జుట్టు సమస్యల్తో బాటు, అనారోగ్యం వల్ల జుట్టు రాలిపోయిన వారికి సైతం హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి విధానాలూ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE