• HOME
  • అందం
  • శిరోజాల శోభను పెంచే నూనెలు

జుట్టుకు నూనెరాయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే గాక అందంగా, సహజంగా ఉంటుంది. దీనివల్ల జుట్టు పొడిబారదు. జుట్టుకు అవసరమైన పోషకాలు సమకూరి కుదుళ్లు గట్టిపడతాయి. తద్వారా జుట్టు రాలే సమస్యా దూరమవుతుంది. చాలామంది  జుట్టుకు కేవలం కొబ్బరినూనె మాత్రమే వాడతారు గానీ కురుల స్వభావం, అవసరాలకు తగిన పలురకాల నూనెలూ అవసరం కావచ్చు. జుట్టు అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచే మరికొన్ని నూనెలివి.

  • ఆముదంతో జుట్టుకు మర్దన చేయటం వల్ల జుట్టు రాలటం ఆగి, నల్లని, ఒత్తైన జుట్టు సొంతమవుతుంది. ఆముదానికి ఆవనూనె కలిపి రాసుకొంటే చిట్లిన జుట్టు ఆరోగ్యకరంగా మారుతుంది.   
  • సహజ నూనెల్లో అవకాడో నూనెది ప్రత్యేక స్థానం. జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలతో బాటు అమినో, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌ ఎ, బి, డి, ఇ కూడా ఇందులో లభిస్తాయి. ఇది డీప్‌ కండీషనర్‌లా పనిచేసి జుట్టు కుదుళ్లను బలపరచి, శిరోజాలు సహజ శోభను పొందేలా చేస్తుంది.
  • కుదుళ్ళ నుంచి చివరలవరకూ జుట్టు దృఢంగా ఉండాలంటే ఉసిరినూనె వాడాలి. ఇందులోని విటమిన్‌ సి నేరుగా జుట్టుకు అందుతుంది. రాత్రి నిద్రకుముందు ఉసిరి నూనె తలకు పట్టించుకుని.. మర్దన చేసుకుంటే అలసట తొలగిపోతుంది. చుండ్రు, జుట్టురాలడం, తలనొప్పి వంటి ఇబ్బందులూ దరిజేరవు.
  • యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆలివ్‌ ఆయిల్‌ చేసేంత మేలు జుట్టుకు మరే నూనె చేయదు. ఇది జుట్టు రాలకుండా, చుండ్రు చేరకుండా చూస్తుంది. అయితే ఆలివ్ ఆయిల్ వాడదలచుకుంటే.. ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆయిల్‌ వాడాలి.
  • కొందరికి జుట్టు చిక్కగా, పొడవుగా ఉన్నాపొడిబారి, కళావిహీనంగా మారుతుంది. వీరు రోజ్‌మేరీ ఆయిల్‌ వాడితే మంచిగుణం ఉంటుంది. పోషకాల లోపంతో జుట్టు ఎదుగుదల తక్కువగా ఉన్నవారికీ ఇది చక్కని ఫలితాన్నిస్తుంది.
  • జుట్టు పలుచగా ఉన్నవారు వారానికి 2 సార్లు స్వీట్‌ ఆల్మండ్‌ ఆయిల్‌ వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా ఎండ, చలివాటి వాతావరణ మార్పులను జుట్టు మీద పడకుండా చేస్తుంది. సముద్రస్నానం చేసేవారు ముందుగా ఈ నూనె రాస్తే  జుట్టుమీద ఉప్పునీటి ప్రభావం పడకుండా చేస్తుంది.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE