• HOME
  • అందం
  • వర్షాకాలంలో హెయిర్ కేర్

ఈ రోజుల్లో వాన జల్లుల్లో తడవటం సహజమే. ఇలా తడిసిన ప్రతిసారీ ఆ ప్రభావం జుట్టు మీద ఖచ్చితంగా పడుతుంది. దీంతో పట్టుకుచ్చులాంటి జుట్టు కళతప్పి వెలవెలబోతుంది. అందుకే వానాకాలంలో కురుల సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ విషయంలో సౌందర్య నిపుణులు సూచిస్తున్న కొన్ని అంశాలు... 

  • జుట్టుకు ప్రధాన శత్రువు.. చుండ్రు. వానలో తడిస్తే చుండ్రు మరింతగా విజృంభిస్తుంది. అందుకే వానలో తడిసినప్పుడు పెరుగు లేదా రి ఫైయిన్డ్ ఆయిల్ తో మాడు, జుట్టుకు మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
  • తడిచిన జుట్టును రోజంతా అలాగే వదిలేస్తే దుర్వాసన రావటంతో బాటు జుట్టు చిట్లటం, రాలటం జరుగుతుంది. అందుకే వానలో తడిసినప్ప్పుడు తడిజుట్టును దువ్వకుండా ముందుగా మెత్తని, పొడి తువ్వాలుతో తల తుడుచుకొని ఆ తర్వాతే దువ్వుకోవాలి. తువ్వాలుతో తల తుడుచుకుంటే అది.. మర్దనగా పనిచేస్తుంది.
  • తలస్నానానికి ముందు ఆముదం వంటి చిక్కని నూనె రాయకూడదు. బాదాం, కొబ్బరినూనె వంటి పలుచని నూనెలు కొద్దిగా వేడిచేసి తలకుపట్టించి మర్దన చేసి దువ్వెనతో తల దువ్వుకోవాలి. దీనివల్ల మాడుకు రక్తప్రసరణ పెరిగి కేశ మూలాలు బలపడతాయి.
  • చుండ్రు బాధితులు తలస్నానం తర్వాత మంచి కండిషనర్ వాడాలి.
  • బయటకువెళ్ళేవారు వానలో తల తడవకుండా గొడుగు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకొంటే మరీ మంచిది.
  • తడిజుట్టును ఆరబెట్టేందుకు హెయిర్ డ్రైయర్ వాడరాదు. వాడితే జుట్టు కొనలు చిట్లి జుట్టు పొడిబారిపోతుంది.
  • వానాకాలంలో హెయిర్ కలరింగ్ లేదా స్ట్రైయిట్ హెయిర్ చేయించుకోవడం మంచిది కాదు.
  • వర్షాకాలంలో వారానికి 2 సార్లు కొబ్బరి నూనెలో కరివేపాకు వేయించి ఆ గోరువెచ్చని నూనెను జుట్టుకు పట్టించి హెర్బల్ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా,నల్లగా మారుతుంది.
  • కాలుష్యం వల్ల జుట్టు పొడిబారి, రాలుతుంటే వారానికి కనీసం రెండు సార్లు హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE