• HOME
 • అందం
 • సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు?

 చలి కొంచెం కొంచెంగా తగ్గుతూ ఎండలు పెరిగే రోజులివి. ఎప్పుడూ మార్చ్ నుంచి మొదలయ్యే ఎండలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే మండిపోతున్నాయి. రాబోయే మూడు నెలలూ దాదాపు ఇదే పరిస్థితి. ఈ ఎండలు, ఉక్కపోతల ధాటికి అన్నింటికంటే ఎక్కువగా దెబ్బతినేది మన చర్మమే. చర్మం సహజసిద్ధమైన  కాంతిని కోల్పోయి సాగటం మొదలు నల్లగా కమిలిపోవటం వరకు ఎన్నెన్నో సమస్యలతో సతమతం అవుతుంటుంది . దీనికి ఎండలోని తీవ్రమైన అల్ట్రా వయొలెట్ కిరణాలు చేసే హాని అదనం. తగిన రక్షణ లేకుండా ఈ రోజుల్లో ఎండల్లో తిరిగే వారి చర్మ సౌందర్యం దెబ్బతినటం తో బాటు  పలు చర్మ సమస్యలూ రావచ్చు. ఈ సమస్యలన్నింటి నుంచి చర్మాన్ని కాపాడే మేలైన ప్రత్యామ్నాయమే సన్ స్క్రీన్ లోషన్.

మండే ఎండలకు సహజంగానే చర్మంలోని తేమ హరించుకుపోతుంది. దీనివల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి, కళావిహీనంగా మారుతుంది. చర్మానికి తగినంత తేమను అందించటం ద్వారా సన్ స్క్రీన్ లోషన్ ఈ  పరిస్థితిని నివారిస్తుంది. చర్మం మీద ప్రసరించే అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రతను అడ్డుకొనే ఓ పొరలాగా ఇది పనిచేస్తుంది. అయితే ఈ సన్ స్క్రీన్ లోషన్ ను ఎలా వాడాలి? ఎన్ని సార్లు వాడాలి? వంటి పలు కీలక అంశాల గురించి తెలుసుకుందాం.

 • ఎండలోకి వెళ్ళటానికి కనీసం ఇరవై నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. గంటకు మించి ఎండలో ఉండాల్సి వస్తే మరోమారు వాడాలి .
 • జిడ్డు చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ లోషన్ ను ఎంపిక చేసుకోవటమో లేక సాధారణ లోషన్ కు ఒకటి, రెండు చుక్కల నీరు కలిపి రాసుకోవాలి.
 • పొడి చర్మం ఉన్న వారు తప్పనిసరిగా లోషన్ వాడాల్సిందే . అయితే ఈ లోషన్ ఆరిన తర్వాత దానిమీద మాయిశ్చ్యరైజర్ రాసుకోవాలి.
 • సన్ స్క్రీన్ లోషన్ యొక్క ఎస్పీఫ్( సన్ ప్రొటెక్షన్ ఫాక్టర్ )ను బట్టి ఆయా లోషన్ ఏ మేరకు యూవీ కిరణాలను అడ్డుకొనగలదో నిర్ణయిస్తారు. అందుకే లోషన్ కొనే సమయంలో దాని ఎస్పీఫ్ విలువ చూసి కొనాలి .
 • సన్ స్క్రీన్ లోషన్ కేవలం ముఖానికే గాక మెడ, చేతులు, వీపు తదితర భాగాలకూ రాసుకోవాలి .
 • 15 నుంచి 20 మధ్యలో ఎస్పీఫ్ విలువ ఉండే లోషన్లు దాదాపుగా అన్ని రకాల చర్మాలకూ పనికొస్తాయి. సున్నితమైన చర్మం మీద లోషన్ రాసినప్పుడు మంటగా ఉంటే వారు అంతకంటే ఎక్కువ ఎస్పీఫ్ విలువ ఉండే లోషన్ వాడాలి.
 • ఎంత సమయం ఎండలో ఉన్నారు? చర్మం తీరు? వంటి అంశాలను బట్టి లోషన్ ఎంపిక చేసుకోవాలి. ముఖం మీద మచ్చలు, చారలు ఉన్నవారు 40 కంటే ఎక్కువ ఎస్పీఫ్ విలువ ఉండే లోషన్ వాడాలి .
 • ఎండ పొడ తగలగానే చర్మం కందిపోవటం, దురద పెట్టటం వంటి లక్షణాలుంటే మరింత ఎక్కువ ఎస్పీఫ్ విలువ ఉండే లోషన్ వాడాలి.
 • నదులలో, స్విమ్మింగ్ పూల్ లో గంటల తరబడి ఈత కొట్టేవారు, సన్ బాత్ చేసేవారూ సన్ స్క్రీన్ లోషన్ వాడాల్సిందే. మంచు , నీటి మీద పడే సూర్యరశ్మి పరావర్తనం చెంది మరింత హాని చేస్తుంది గనుక చల్లని వాతావరణంలో వుండేవారు సైతం ఎండలోకి వెళ్తే లోషన్ వాడటం మంచిది .Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE