• HOME
  • అందం
  • కాటుక పెట్టుకొనే ముందు...

ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. కాటుక ఎండ, దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కంటిని కాపాడటమే గాక కళ్లను తాజాగా, మెరిసేలా చేస్తుంది. మంగళ ద్రవ్యమైన కాటుక ధారణ సుమంగళత్వాన్ని ప్రసాదిస్తుందని పెద్దలు చెబుతారు. కాటుక కంటికి చలువ చేస్తుందని ఆయుర్వేదమూ చెబుతోంది. అయితే కాటుక వినియోగం విషయంలో ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొంటే కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అవి..

  • కాటుక పెట్టుకొనే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కళ్లపై తడిలేకుండా తుడుచుకోవాలి.
  • ఎక్కువగా చెమట పెట్టే చర్మంగలవారు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కాటుక పెట్టుకునేవారు ముఖాన్ని ఐస్‌ ముక్కలతో మర్దన చేసుకోవాలి. దీనివల్ల చెమట పట్టడం తగ్గి తద్వారా పెట్టిన కాటుక చెదరకుండా ఉంటుంది.
  • కాటుక పెట్టుకునే ముందు మెత్తని వస్త్రంతో కనురెప్పను తుడుచుకోవాలి. దీనివల్ల కనురెప్పలపై ఉండే జిడ్డు పూర్తిగా తొలగిపోతుంది. లేదా కొద్దిగా పౌడర్‌ కళ్ల చుట్టూ రాస్తే చర్మంపై ఉండే జిడ్డుని పౌడర్‌ పీల్చుకొని కళ్లు తాజాగా ఉంటాయి.
  • కనురెప్పల కోన భాగంలో కాటుక పెట్టుకొంటే చెరిగిపోయే అవకాశం ఎక్కువ గనుక కనురెప్పల మధ్యన కాటుక పెట్టుకోవాలి.
  • కాటుక పెట్టుకునే ముందు కళ్లకి లైట్‌ కలర్‌ ఐషాడో బేస్‌గా వేసుకొన్నా కాటుక చెదిరిపోకుండా చూసుకోవచ్చు.
  • నాణ్యమైన కాటుక వాడాలి. కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటపుట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాటుక వాడటం ఆపాలి.



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE